Sunday, April 3, 2022

శివోహం


శివా!హాలాహలాన్ని అదిమిపట్టి
అమృతాన్ని విడిచిపెట్టినా
నీవె శాశ్వతుడవు నీలకంఠా
మహేశా . . . . . శరణు .

శివోహం

నీవు పరమాత్ముడవు...
నేను జీవాత్ముడను...
కానీ నా అంతరాత్మలో  నిన్ను చూడాలన్న ఆవేదన...
నాలాంటి అజ్ఞానాంధకారబంధురంలో
కొట్టుమిట్టాడే కర్మబద్ధుడికి అది సాధ్యమేనా తండ్రి...

మహాదేవా శంభో శరణు...

Saturday, April 2, 2022

శివోహం

ప్రేమ కన్నా విధేయత...
విధేయతకన్నా అర్పణ గొప్పవి...
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ, విధేయత, అర్పణ ఈ మూడూ కలిస్తే భగవత్ ప్రేమ అవుతుంది.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

మాయ జలమున మునిగేవు మనసా...
దారి తెలియక తడబాటు ఎలా...
జ్ఞాన నేత్రమున వెదికి చూడవే మనసా...
శాశ్వత జ్యోతిని కనుగొనవే మనసా..

ఓం శివోహం...సర్వం శివమయం.

Friday, April 1, 2022

శివోహం

సర్వలోక నాయకా
శ్రీ ఆశ్రిత రక్షకా
శ్రీ సర్వసంపద దీపికా
శ్రీ దేవి వల్లభా
శ్రీ అభయప్రధాతా
శ్రీ పద్మనాభా
శ్రీ వేణునాదామృతా
శ్రీ వేంకటేశ్వరా శరణు...

శివోహం

శివా!మరణమంటే భయము లేదు
జన్మ జాడ్యమనిన జంకు గాని
ఆ జాడ్యాన్ని తొలగించు మరణమీయి
మహేశా . . . . .  శరణు..

శివోహం

ఈ సృష్టిలో...
నీకై నిర్ణయించబడినది నీదరికి చేరే తీరుతుంది...

నీది కాని దానికోసం నువ్వేంత ప్రయత్నించన వ్యర్థమే...

ఓం శివోహం...సర్వం శివమయం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...