Sunday, April 17, 2022

శివోహం

రూపాలు ఎన్నో నామాలు ఎన్నో 
మార్గాలు ఎన్నో గమనాలు ఎన్నో 
బోధలు ఎన్నో కథనాలు ఎన్నో 
సాధనాలు ఎన్నో శోధనలు ఎన్నో 
కానీ ఉన్నది పరబ్రమ్మం ఒక్కటే 
తుదకు అందరి గమ్యం ఒక్కటే

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

నీకు భక్తి ముఖ్యం...
భక్తిలో నిజాయతీ ముఖ్యం...
ఆ ఒక్క అర్హతా ఉంటే...
పచ్చి విషమిచ్చినా ప్రేమగా తాగేస్తావు....
క్షీరసాగర మథనంలో హాలాహలాన్ని...
పుచ్చుకున్నదీ ఆ మమకారంతోనేగా...
మహాదేవా శంభో శరణు

Saturday, April 16, 2022

శివోహం

ఈ అనంత సృష్టికి 
అందాన్ని ఇచ్చింది నువ్వు కదా శివ...
నీ చూపు సోకిన ప్రతి చోటు కైలాసమే...

మహాదేవా శంభో శరణు.

శివోహం

జన్మ జన్మలుగా మనం పోగుచేసుకున్న సంస్కారాలు. సంసారంగా భావించే ఈ సంస్కారాలే స్వస్వరూప దర్శనానికి అడ్డుగా ఉన్నాయి...
దేహభ్రాంతితో మనం సత్యంగా భావించేదంతా మాయ. సత్యం కాని విషయాలపట్ల జ్ఞానం, మిథ్యాజ్ఞానంగా ఉండటంవల్ల మనకు అవిద్యగా కనిపిస్తుంది...
అంతే తప్ప ఆత్మానుభవం కానీ వారే లేరని భగవాన్ శ్రీరమణమహర్షి స్పష్టం చేశారు...
అనుభవానికి అడ్డు వస్తున్న త్రిగుణాలు, వాసనా వికారాలు తొలగించుకోవాలి. అంతేగాని భౌతిక జీవనం దైవ దర్శనానికి ఏ రకంగా అడ్డుకాదు. జ్ఞానులు, యోగులకు కూడా భౌతిక జీవనం తప్పలేదు కదా ! సత్యాసత్యాలు ఒకేసారి అనుభవంగా ఉంటున్నా వాసనాబలం దేహస్మృతికే ప్రాధాన్యత ఇవ్వడంవల్ల సత్యం అర్ధం కావటం లేదు. బాహ్యంగా కనిపించే ఫలాన్ని గౌరవిస్తూ మూలమైన 
 విత్తనాన్ని పరిగణలోకి తీసుకోనరు.

సేకరణ:

Friday, April 15, 2022

శివోహం

భగవంతునికి భక్తునికి భేదం లేదు...
జీవాహంకారం ఉన్నంత వరకు జీవుడిలో భేదభావం కొనసాగుతూ ఉంటుంది...
ఆ జీవాహంకారమనే అడ్డు తొలగించుకుంటే భగవదైక్యమె.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

అబద్దం...
అంతా అబద్దం...
బందాలు  అబద్దం...
నీ చుట్టూ బంధుత్వాలు అబద్ధం...
తరిగిపోయే వయసు అబద్దం...
కరిగిపోయే అందం అబద్దం...
నువ్వు అబద్దం నేను అబద్ధం...
నీ తనువు అబద్దం...
నీ బ్రతుకే పెద్ద అబద్దం...
పరమాత్మ ఒక్కటే నిజం.

ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, April 14, 2022

శివోహం

అమ్మా...
నాకు నీ మంత్రము తెలియదు...
నీ యంత్రమూ తెలియదు...
నిన్ను స్తుతించడమూ తెలియదు...
నిన్ను ఆవాహన చేయడమూ తెలియదు...
నిన్ను ధ్యానించడమూ తెలియదు...
నీ గాధలు చెప్పడమూ తెలియదు...
నీ ముద్రలూ తెలియవు...
ఇవేవి తెలియవని నీకోసం విలపించడమూ కూడా చేత కాదు...
కానీ, అమ్మా నీ దయ ఉంటే నా సమస్యలన్నీ సమసిపోతాయని మాత్రం తెలుసు...

ఓం శ్రీమాత్రే నమః

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...