Wednesday, May 4, 2022

శివోహం

బాధలలో నున్నవారికి చుట్టము దేవుడే.

నిద్రపోయిన వాడు మేల్కాంచినపుడు తానున్న పరిస్థితులను తెలిసికొనగలడు. అట్లే దేవునియందు మెలకువ కలిగిన వాడు ఆతని చరణమును పొంది యదార్థ జ్ఞానమును పొందును. అతడొకడే బ్రహ్మసృష్టిని గూర్చి తెలుసుకొనును.

బ్రహ్మయు, అతని సృష్టియు నారాయణుని యందే భాసించుచున్నవని మేల్కొనును. అంతకు ముందు మాత్రము తాను బ్రహ్మ సృష్టిలో నొక భాగమై జగత్తునందు మాత్రము మేల్కొనును.

అట్టివారు ఒకరియందొకరు మేల్కొని , తమ పనులను చక్కపెట్టుకొను యత్నమున తీరుబడి లేనివారై యుందురు.  

నారాయణుని యందు మేల్కొనిన వారికి సర్వము నారాయణుడే కనుక అంతయు తీరుబడియే. కర్తవ్యములు మాత్రము నిర్వహింపబడుచుండును.

శివోహం

సుఖం కలగాలంటే పుణ్య కార్యాలు చేయాలి...

ఎందుకంటే పాప కార్యాలు దుఃఖాన్ని కలిగించి నరకాన్ని చూపిస్తాయి...

ముక్తి కావాలంటే పరమాత్మ శరణాగతి చేయాలి.. 

ఓం శివోహం...సర్వం శివమయం.

Tuesday, May 3, 2022

శివోహం

శివ నామమే నాకు శ్రీరామ రక్ష...
శివ క్షేత్రమే నాకు ఆనంద నిలయం...
శివ కుటుంబమే నా ఆత్మ బంధువులు...

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, May 2, 2022

శివోహం

మనసు విరిగితేనే అహము పోయేది...
అహము పోతేనే అజ్ఞానం పోయేది...
అజ్ఞానం పోతేనే ఆత్మజ్ఞానం వెలిగేది...
ఆత్మజ్ఞానం వెలిగితేనే భ్రాంతి పోయేది...
భ్రాంతి పోతేనే బ్రహ్మము దరిచేరేది...
బ్రహ్మము దరిచేరితేనే బట్ట బయలయ్యేది...
బట్ట బయలైతేనే బయటపడేది.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శంభో...
నా మనసుకు ఎంత ధైర్యం...
నా మాట వినడం లేదు...
నీ నామ స్మరణ చేయడం లేదు...
మూడో కన్ను విప్పు చూడు భస్మం అయ్యేలా...

మహాదేవా శంభో శరణు.

Sunday, May 1, 2022

శివోహం

నిజమైన నేను ఆది అంతంలేని అనంతసాగరం లాంటిది. ఈ అనంత సాగరంలో ‘‘మాయా నేను’’ నీటి బుడగలా ఏర్పడుతుంది.ఈ నీటి బుడగనే జీవుడు(మొదటి ఆలోచన)లేదా వ్యక్తిగత ఆత్మ అంటారు. నిజానికి ఈ బుడగకూడ నీరే,నీరులో బాగమే. ఇది బద్దలైనపుడు పూర్ణసాగరంలో కలిసిపోతుంది. ఈ జీవుడు బుడగగా ఉన్నప్పుడు కూడ సాగరంలో ఒక భాగంగానే ఉన్నది. ఈ సరళ సత్యాన్ని విస్మరించి
ఎన్నో సిద్ధాంతాలు రూపుదిద్దుకున్నాయి...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

గడబిడ మనమున గుండెలో అలజడి కలుగుతుంది పరమేశ్వరా...
నీవే నాకు కొండంత అండగా ఉండి...
నన్ను కాపాడగారావా...
మహాదేవా శంభో శరణు....

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...