Monday, May 9, 2022

శివోహం

నీ ధ్యానం కంటే  ముఖ్యమైన పని ఏముందిలే శంకరా...
అసలు నేను పుట్టిందే నిన్ను సేవించడానికే కదా...
నా జీవిత పరమార్ధం నీ దయను పొందడమే కదా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

జీవితంలో  ప్రతి  ఒక్కటి పరమాత్మా  అనుగ్రహంతో  ఇవ్వబడినవి...
తల్లి  తండ్రులు , భార్య  బిడ్డలు , ఆస్తిపాస్తులు , ఈ  జన్మ నేను  తెచ్చుకున్నది  కాదు...
కాబట్టి  ఎప్పుడో  ఒకసారి  మళ్ళీ పరమాత్మే  తీసేసుకుంటాడు...
దేని  మీద  మనకి  హక్కు  లేదు , నేను  తెచ్చుకోలేదు కాబట్టి  ఇది  నాది  అని మమకారం  పెంచుకోవడం  లాంటి  భ్రమ  తగదు...
నాది అంటే బంధము...
నాది  కాదు  అంటే  మోక్షము .
నాది అంటే  అపచారము
పరమాత్మా  అంతా  నీది  అంటే ఉపచారము...

ఓం శివోహం... సర్వం శివోహం.

Sunday, May 8, 2022

శివోహం

తండ్రి వలె దయగల మహారాజు...
తండ్రి చిటికెడు విభూది కి కరుణిస్తే...
పిడికెడు అటుకులు బెల్లం నీకు చాలు...

హరిహరపుత్ర శరణు...

Friday, May 6, 2022

శివోహం

మనిషి జీవితం దుఃఖమయం
తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్వ జన్మ జ్ఞానం ఉండడంతో అయ్యో పుణ్యం సాధన చేయకుంటిని అని దుఃఖిస్తాడు.

ఈ గర్భస్తు నరకం నుండి ఎప్పుడు
బయటపడితే మళ్ళీ పదార్థ ప్రపంచంలో పడతానని  దుఃఖిస్తాడు.

బయటకి రాగానే కన్నీళ్లు పెట్టుకుంటే పూర్వ జ్ఞానం పోయిందే అని  దుఃఖిస్తాడు.

తల్లి పాల కోసం ఆకలితో  దుఃఖిస్తాడు
శిశు ప్రాయంలో ఏది చెప్పాలన్నా  ఏడుపు తప్ప వేరే మార్గం లేదు.

బాల్యం వచ్చేసరికి విద్య బుద్ధులు
నేర్పించడానికి పాఠశాలకు పంపుతారు విషయం పెరుగుతుందని దుఃఖిస్తాడు.

యవ్వనం రాగానే ఆకర్షణ మొదలవుతుంది ప్రేమ కోసం దుఃఖిస్తాడు.

ఉద్యోగం రాలేదని దుఃఖిస్తాడు.

ఇక్కడ విచారణ చేయాలి ఎందుకు ఎలా జరుగుతోందని అప్పుడే జ్ఞానం కలుగుతుంది  అంతేకాని ఆత్మ హత్య చేసుకోరాదు.

పెళ్లి చేస్తే స్వేచ్ఛ పోయినదనిదుఃఖిస్తాడు.

భార్య బిడ్డలు మాట వినలేదని దుఃఖిస్తాడు.

పక్క వాళ్ళ కంటే మనం తక్కువగా ఉమ్నమని దుఃఖిస్తాడు.
వ్రిద్ధాప్యం వచ్చాక నవారు నన్ను చూడలేదని దుఃఖిస్తాడు.

ఆఖరికి మరణ సమయంలో కూడా ఈ వదలడం ఇష్టం లేక అందరి మీద మమకారం పెంచుకుని అయ్యో వాళ్లకు ఓ దారి చూపించకుండా పోతున్నానని దుఃఖిస్తాడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

మనస్సు ఈ ప్రపంచంలో ఎన్నోజన్మలు  అనిత్యమైన సుఖాల  కోసం  తిరిగి తిరిగి అలసిపోయి చివరికి ఇవేవి నిత్యం కాదని పరమాత్మా వైపుకి తిరుగుతుంది మనస్సు అదే భక్తి అప్పుడు శాంతి తృప్తి లభిస్తాయి.
ఇన్నాళ్లు నేను నాది అని అహంకార మమకారాలు పెంచుకున్నాను ఇప్పుడు తెలిసింది నేను కాదు నాది కాదు
అంతా పరమాత్మే నేను కేవలం నిమిత్త మాత్రుడను అనే భావన కలుగుతుంది అదే శరణాగతి.
మన భక్తికి మెచ్చి భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.

 మనం బయట ప్రపంచాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని   వెతికి తెలుసుకుంటాము, కానీ బయట వెతకాల్సిన అవసరం లేదు.
మనలోనే ప్రపంచం ఉంది, పరమాత్మా ఉన్నాడు. కాబట్టి మన గురించి మనం తెలుసుకుంటే చాలు.  బంధం, మోక్షము  కూడా మనలోనే ఉన్నాయి. అంతర్ముఖత చెందాలి అప్పుడు విచారణ, అన్వేషణ మొదలవుతుంది.

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, May 5, 2022

శివోహం

ఈశ్వరుడు భక్తుడిని అనుగ్రహించడానికి భక్తుని యెడల ప్రత్యేకంగా అభిమానంగాని, ద్వేషంగాని ఉండవు. 

ఈశ్వరునికి పక్షపాత బుద్ధి ఉంటే ఆయనను ఈశ్వరుడని ఎందుకంటాం ? భక్తులు మాత్రం దైన్య స్థితిని బట్టి గాని, ప్రీతిని బట్టిని గాని ఈశ్వరుని మీద అటువంటి పక్షపాతాన్ని ఆరోపిస్తూ ఉంటారు.

            నిజానికి భగవదనుగ్రహం సదా సర్వత్రా సహజంగానే ఉంటుంది. ఆ అనుగ్రహాన్ని పొందడానికి భక్తుడు తనలోనే ఉన్న అహంకారాదుల అడ్డు తొలగించు కుంటే భగవదనుగ్రహానికి పాత్రుడవుతాడు. అడ్డు తెరలను తొలగించుకుంటే ఈశ్వరానుగ్రహం సహజంగానే లభిస్తుంది.

 మానవ అనుగ్రహం కావాలంటే చేయవలసిన పనులు మనకు తెలుసు. అటువంటివన్నీ అహంకారాదులతో, స్వార్థంతో కూడుకొని ఉంటాయి. 

ఈశ్వరానుగ్రహానికి ఏమీ చేయనవసరం లేదు. భక్తులందరికీ ఒకే ఒక్క నియమం. అదేమంటే వారి వారి అహంకార మమ కారాలను వదలాలి. 

వస్తువుల మీద, విషయాల మీద ఆసక్తిని వదలి, సర్వమూ ఈశ్వరమయంగా చూడగలిగిన భక్తిని కలిగి ఉండటమే వారి అర్హత.

అహము, ఆత్మాభిమానమ్ము లణగియున్న 
మనసుకే, భగవానుడు కనబడును. -మెహెర్‌ బాబా

Wednesday, May 4, 2022

శివోహం

బాధలలో నున్నవారికి చుట్టము దేవుడే.

నిద్రపోయిన వాడు మేల్కాంచినపుడు తానున్న పరిస్థితులను తెలిసికొనగలడు. అట్లే దేవునియందు మెలకువ కలిగిన వాడు ఆతని చరణమును పొంది యదార్థ జ్ఞానమును పొందును. అతడొకడే బ్రహ్మసృష్టిని గూర్చి తెలుసుకొనును.

బ్రహ్మయు, అతని సృష్టియు నారాయణుని యందే భాసించుచున్నవని మేల్కొనును. అంతకు ముందు మాత్రము తాను బ్రహ్మ సృష్టిలో నొక భాగమై జగత్తునందు మాత్రము మేల్కొనును.

అట్టివారు ఒకరియందొకరు మేల్కొని , తమ పనులను చక్కపెట్టుకొను యత్నమున తీరుబడి లేనివారై యుందురు.  

నారాయణుని యందు మేల్కొనిన వారికి సర్వము నారాయణుడే కనుక అంతయు తీరుబడియే. కర్తవ్యములు మాత్రము నిర్వహింపబడుచుండును.

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.