Saturday, May 28, 2022

శివోహం

నువ్వు ఆనందంగా జీవించాలి అనుకుంటే నిన్ను ఎవరు అడ్డుకోలేరు...
వాస్తవం ఏంటి అంటే నిన్ను అడ్డుకోవట్లేదు

ఓం నమః శివాయ.

Friday, May 27, 2022

శివోహం

శంభో!!!! 
నిన్ను జూడ కోరి కోరి నే కనులు మూయగా
మినుకుమంచు కునుకునందు కానవత్తువు
అదరిపడి..నే-నులికిపడి..పే-రాశపడి
మత్తువీడి కనులు దేరిస్తే పత్త దొరకవు
కలతచెంది నేను వెదకుచుండ అటూఇటూ
నువ్ కిలకిల నవ్వుచున్నావా ఆ కైలాసంలోన
నమ్మరాదు శివ అమ్మో నిన్ను నమ్మరాదు శివ
నమ్మకుంటె నాకు దిక్కులేదు శివ నువ్వు తప్ప

మహాదేవా శంభో శరణు.

Thursday, May 26, 2022

శివోహం

ఎక్కడో ఏదో నాలోనే తప్పుందనిపిస్తుంది... ఏమరుపాటుతో వినడమో, చదవడమో, అవగాహనాలోపమో ఏదో పొరపాటు నాలోనే వుంది...
అది ఏమిటన్నది గ్రహించలేకపోతున్నాను...
అప్పటినుండి నాలో తెలియని అపరాధభావన. సరైనది ఏమిటో తెలుసుకోవాలన్న తపన...
ఆ తపనతో  ఆర్తిగా మీ ముందుకు వచ్చి అభ్యర్ధిస్తున్నాను శివ సరైన మార్గంలో నేను పయనించడానికి...

మహాదేవా శంభో శరణు.

శివోహం

భయమును  సృష్టించేవారు, తీసేసే వారు పరమాత్మే.  కనుక  మనమెప్పుడు పరమాత్మని  ప్రసన్న వదనంతో వున్న మూర్తియై కనపడమని కోరుకోవాలిట. కష్టము కలిగించే వాడు పరమాత్మే, కష్టాన్ని తీసేసే వాడు పరమాత్మే. కష్ట కాలములో తనని మర్చిపోయేటట్టు చేసేది పరమాత్మే. మనస్సులో పరమాత్ముని పాదములు  వదలకుండా పట్టుకుని, నన్ను మన్నించి నీ  త్రోవలో నన్ను పెట్టుకో అని మనః స్ఫూర్తిగా ప్రార్దించినట్లైతే, అయన సంతోషించి, మనకు  కలిగిన గాయాన్ని మాన్పించి యధా మార్గంలో పెడతారు. 

ఓం శివోహం...సర్వం శివమయం

Wednesday, May 25, 2022

శివోహం

జగత్ దృష్టి తొలిగితే తానెవరో తెలుస్తుంది...
తానెవరో తెలిస్తే జగత్ దృష్టి తొలగుతుంది...
ఎటు నుంచైనా మొదలు పెట్టు...
మనస్సును తుదముట్టించు...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

దేహమను క్షేత్రంలో -
భగవత్స్వరూప స్మరణ లేక ఆత్మభావనయు; 
ప్రేమ అను జలాభిషేకమును; 
శాంతము, దయ, సత్యం, వైరాగ్యం, తపస్సు అనెడు పుష్పములను; 
సర్వేశ్వరధ్యానానందం లేక భక్తితో మునిగిన హృదయామృతమగు నైవేద్యమును 
ఉన్నప్పుడే మానవజన్మ సార్ధకత! 
లేనిచో మానవజన్మ వ్యర్ధం.
 
- మహర్షి సద్గురు శ్రీ మలయాళస్వాములవారు

Tuesday, May 24, 2022

శివోహం

బాధ లేని మనిషి కానరాడు...
బాధ పడేవాడు ఎన్నడూ బాగుపడడు...
బాధ లేకుంటే వాడసలు మనిషి కాడు...
బాధ పెట్టుట మాకు నీ పరీక్ష కాదా శివ...

మహదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...