Sunday, May 29, 2022

శివోహం

శివ!!! నీవు నాకు కనిపించక లేదను...
నీవు లేవని అనను నేను...
నీవే ఏదో నాడు దర్శనం ఇస్తావు...
నన్ను కైలాసం కు తీసుకు వెళ్తావు...
అప్పటి వరకు ఓం నమః శివాయ నే...

మహాదేవా శంభో శరణు

Saturday, May 28, 2022

శివోహం

చిత్తం శివమయం కావాలి! మనస్సు నుంచి అందుకున్న విషయాన్ని వడబోసి బుద్ధి మళ్లీ మనసుకే అందిస్తుంది. అది స్వతంత్రు రాలు కాదు. బుద్ధి ద్వారా అందిన విషయాన్ని మనస్సు స్వయంగా ప్రకటించవచ్చు లేదా మళ్లీ ఒక అధికారి ద్వారా పంపి శోధన చేయించవ చ్చు. మనస్సు తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత చిత్తం అధికారాన్ని కలిగి ఉంటాయి. అయితే బుద్ధి, చిత్తం ఒకేస్థాయి గలవి. ఒక కార్యాలయంలో ఆఫీసరు దగ్గర ఇద్దరు హెడ్‌ గుమస్తాలున్నట్లుగా ఉం టాయి. విషయ ప్రాధాన్యాన్ని బట్టి మనస్సు బుద్ధి, చిత్తాలను వాడుకుంటుంది. అయితే, ఏదో ఒకటి లేకుండా చేయడం గానీ, ఒకే చిత్తం ద్వారా చేయ డం గానీ జరుగవచ్చు లేదా జరుగకపోవచ్చు. ఒక విషయం బుద్ధి నుంచి చిత్తానికి వెళ్లి ప్రకటితమైతే అది స్థిరీకరణ పొందుతుంది. చిత్తం బుద్ధి ద్వారా నిశ్చయమైన విషయం తాలూకు ఉచితానుచితాల ను స్థిరపరిచి శుభ్రంగా మనస్సు ముందుంచుతుం ది. చిత్తం స్థిరీకరణం చేసిన దానిని మళ్లీ పునఃపు నః మనస్సు పరిశీలించే అవకాశాలు తక్కువే.

పరమాత్మ సాధనలో మనోలయమంటే సంశయనాశనం. బుద్ధినాశమంటే స్ఫుర నిర్ణయంతో స్పందించడం. చిత్తనాశమంటే స్థిరత్వం చూపించి కదలకపోవడం. అహంకార నిరసనమంటే ‘నేను చేసినానని భావించుకోవడం’. ఈ నాలుగు ముఖ్యాంశాలకు ‘చిత్తమే’ తాళపు చెవి. ఈ చిత్తం ఒక అంశాన్ని స్థిరీకరణ చేసే ముందు ఎన్నెన్నో విషయాలను పరిశీలించి గుణగణాలను పరిగణిస్తుంది. భూత, భవిష్య ద్వర్తమాన.. ఇలా ఎంతదూరం పోతుందో దానికే ఎరుక. తిరిగివచ్చి మళ్లీ తరచితరచి చూస్తుంది. ఊహా ప్రపంచంలో విహరిస్తుంది, విహరింపజేస్తుంది కూడా. అందుకే, పరమాత్మ సాధకులు ముందుగా చిత్తాన్ని చిత్తుచేయా లి. చిత్తం చిత్తు చిత్తయితే సత్తు నీ సొత్తవుతుంది. కేవలం బుద్ధి ప్రమేయం లేని చిత్తానికి ‘చిత్త’మన్నవాడు తప్పకుండా జీవితంలో అన్నింటా చిత్తుచిత్తవుతాడు. అందుకే, చిత్తాన్ని శివ సమాయత్తం చేయాలి. ఈ ‘చిత్తం’ జగద్రూపంలో ఉంటుంది. జగత్తును ఆచితూచి తేరిపారగా చూస్తే ఏమీ లేదనే ఒకానొక భావన గోచరిస్తుంది. ఇది కోరదగింది కాదు. మరి, కాల్పనిక జగత్తును ‘చిత్తం’గానే చూస్తే ఇది పరిణామశీలమే కదా అనిపిస్తుంది. అందుకే, చిత్త మే జగత్తు. జగత్తు వేరుగా లేదు. నీవుగా, చూపుగా జగత్తుగా ఉన్నది ‘చిత్తే’. ‘చిత్తమేవహి సంసారః’ కదా! ఈ భ్రమల నుంచి బయటపడాలి. ఇటువంటి చిత్తే ఇప్పుడు నీ చిత్తంగా ఉన్నది. కనుక, చిత్తం వైపు చూస్తున్నప్పుడు నిర్లిప్తంగా ఉండాలి. మన పైత్యం కలిపితే వికారమవుతుంది. చిత్తం నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న స్థితిలో బుద్ధి ద్వారా వచ్చిన లేదా మనస్సు ద్వారా వచ్చిన అంశాన్ని సరిగ్గా స్థిరీకరిస్తుంది.

చిత్తవృత్తి (ఆలోచన) నిరోధమే యోగమవుతుం ది. ఆలోచనాతరంగాలను మళ్లించగలగాలి. అం దుకోసం, చిత్తవశీకరణ సామర్థ్యం ఉన్న సముచిత పదార్థాన్ని మనం ఆశ్రయించాలి. లేకుంటే, గుడ్డివాణ్ని నమ్మిన నూర్గురు గుడ్డివారు బావిలో పడ్డట్టవుతుంది. చిత్తాన్ని సక్రమంగా నడిపేది, కళ్లు తెరిపించేది, జ్ఞానాంశ ప్రతిపాదకమైన పరమాత్మ సేవ నం. భజన, కీర్తన, స్మరణ, అర్చన, పరోపకారం, నిష్కల్మషత్వం లాంటివాటిని నిరంతరం అభ్యాసంలో ఉంచుకుంటే చిత్తం తన స్థిరీకరణను సక్రమంగా చూపుతుంది. ఇటువంటి పరిశీలనా దృక్ప థం ఉన్న చిత్తం కూడా మోహానికి గురయ్యే అవకాశం ఉన్నది. ‘జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాదాకృష్య మోహాయా మహామాయా ప్రయచ్ఛతి’. చిత్తంలో చేరకూడని పదార్థం చేరితే దానిని ‘మాయ’ అందాం. అది చేరితే తప్పే ఒప్పు గా, ఒప్పు తప్పుగా కన్పిస్తుంది. మన జీవితం తుప్పు పట్టిపోతుంది.

అందుకే, చిత్తానికి చేతనత్వాన్ని కలిగించే నిత్యచైతన్య పారమాత్మికతను సాధించిపెట్టే భగవంతు ని స్మరణతో సాధనను ముందుకునడిపించాలి. తద్వారా చిత్తాన్ని శివునిగా మార్చాలి. చిత్తాన్ని లొంగదీసుకోవాలంటే కోపతాపాలు, చిర్రుబుర్రు లు, వేగం పనికిరావు. ఆలోచన అవసరం. చిత్తాని కి నామస్మరణ, దేవతాపూజ మొదలైన మంచిపను లు, పరోపకార జీవన విధానాలను సరైనరీతిలో అలవాటు చేయాలి. అక్కర్లేని పదార్థాలను వదిలిం చి, మంచి విషయాలను అందించి లాలనతో ఎదిగేలా మనం సవరించుకోవాలి. అప్పుడే మనిషి గొప్పతనం నిరూపితమవుతుంది. సాధనాత్‌ సాధ్యతే సర్వమ్‌!!

 శ్రీ శ్రీ శ్రీ మాధవానందా స్వామి

శివోహం

నువ్వు ఆనందంగా జీవించాలి అనుకుంటే నిన్ను ఎవరు అడ్డుకోలేరు...
వాస్తవం ఏంటి అంటే నిన్ను అడ్డుకోవట్లేదు

ఓం నమః శివాయ.

శివోహం

నువ్వు ఆనందంగా జీవించాలి అనుకుంటే నిన్ను ఎవరు అడ్డుకోలేరు...
వాస్తవం ఏంటి అంటే నిన్ను అడ్డుకోవట్లేదు

ఓం నమః శివాయ.

Friday, May 27, 2022

శివోహం

శంభో!!!! 
నిన్ను జూడ కోరి కోరి నే కనులు మూయగా
మినుకుమంచు కునుకునందు కానవత్తువు
అదరిపడి..నే-నులికిపడి..పే-రాశపడి
మత్తువీడి కనులు దేరిస్తే పత్త దొరకవు
కలతచెంది నేను వెదకుచుండ అటూఇటూ
నువ్ కిలకిల నవ్వుచున్నావా ఆ కైలాసంలోన
నమ్మరాదు శివ అమ్మో నిన్ను నమ్మరాదు శివ
నమ్మకుంటె నాకు దిక్కులేదు శివ నువ్వు తప్ప

మహాదేవా శంభో శరణు.

Thursday, May 26, 2022

శివోహం

ఎక్కడో ఏదో నాలోనే తప్పుందనిపిస్తుంది... ఏమరుపాటుతో వినడమో, చదవడమో, అవగాహనాలోపమో ఏదో పొరపాటు నాలోనే వుంది...
అది ఏమిటన్నది గ్రహించలేకపోతున్నాను...
అప్పటినుండి నాలో తెలియని అపరాధభావన. సరైనది ఏమిటో తెలుసుకోవాలన్న తపన...
ఆ తపనతో  ఆర్తిగా మీ ముందుకు వచ్చి అభ్యర్ధిస్తున్నాను శివ సరైన మార్గంలో నేను పయనించడానికి...

మహాదేవా శంభో శరణు.

శివోహం

భయమును  సృష్టించేవారు, తీసేసే వారు పరమాత్మే.  కనుక  మనమెప్పుడు పరమాత్మని  ప్రసన్న వదనంతో వున్న మూర్తియై కనపడమని కోరుకోవాలిట. కష్టము కలిగించే వాడు పరమాత్మే, కష్టాన్ని తీసేసే వాడు పరమాత్మే. కష్ట కాలములో తనని మర్చిపోయేటట్టు చేసేది పరమాత్మే. మనస్సులో పరమాత్ముని పాదములు  వదలకుండా పట్టుకుని, నన్ను మన్నించి నీ  త్రోవలో నన్ను పెట్టుకో అని మనః స్ఫూర్తిగా ప్రార్దించినట్లైతే, అయన సంతోషించి, మనకు  కలిగిన గాయాన్ని మాన్పించి యధా మార్గంలో పెడతారు. 

ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...