Thursday, June 2, 2022

శివోహం

బాధలను హరించేవాడు హరుడు...
పాపాలను తుడిచి పెట్టేవాడు పరమేశ్వరుడు ఒక్కడే...
అపరాధాలను మన్నించ మని అనుగ్రహాన్ని అందించి
ప్రయాణాన్ని సుగమంగా మార్చమని
ప్రార్థిస్తూ భగవంతుని హర హర మని
ఎలుగెత్తి పిలుద్దాము..

ఓం నమః శివాయ.

శివోహం

తనువులో ముళ్ళు...
మనసులో కుళ్ళు...
ఎంగిలాకు బతుకుళ్ళు...
ఉండేది కల్ముషలోగిళ్ళు...
రోగాలతో వళ్ళు...
మరణశయ్యపై చేరేవాళ్ళు మేము...
మా మీద ని ప్రతాపం ఏంటి ఈశ్వరా...

మహాదేవా శంభో శరణు...

Wednesday, June 1, 2022

శివోహం

నీది అనుకుంటే వదలకు పట్టుదలతో ప్రేమతో సాధించు...
వద్దు అనుకుంటే ఇమడకు చిరునవ్వు తో నొప్పించక తప్పించు...

ఓం నమః శివాయ.

శివోహం

శంభో...
ఎన్నో పనులు చేయడానికి సమయం, ఓపిక,డబ్బు,తపన ఉంటాయి...
కానీ 24 గంటల్లో నిన్ను తలిచే ఓపిక గాని తీరిక గాని సమయం గాని ఉండడం లేదు...
తండ్రీ ఏమిటీ మాయ, ఎందుకీ లీల,ఈ పరీక్ష,ఈ జగన్నాటకం,ఈ తోలుబొమ్మలాట...

మహాదేవా శంభో శరణు.

శివోహం

నువ్వు నీ సొంత కాళ్లపై నిలబడి ఉన్న కొంచెం ఇతరులను గౌరవించడం నేర్చుకో మిత్రమా ఎందుకంటే మరణించిన తరువాత నీ సొంత కాళ్లతో స్మశానం కు చెరుకోలేవు కదా...

ఓం నమః శివాయ

శివోహం

ఆత్మ శుద్ధి లేకుండా శరీరాన్ని ఒక్కటే శుద్ధి చేసుకొని గుడికి వెళ్లి భగవంతుడా నన్ను కాపాడు అని ప్రయోజనం లేదు...

ఓం నమః శివాయ.

శివోహం

కోపం రావడం మానవ సహజం అయితే కోపాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత...

ఓం నమః శివాయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...