Wednesday, June 15, 2022

శివోహం

శంభో...
నా అహం ను ఛిద్రం చేసి...
నా బ్రతుకు నీ పాదముల కడ భద్రం చేయవయ్య శివ...

మహాదేవా శంభో శరణు.

Tuesday, June 14, 2022

శివోహం

తాను అంటే నేను లేస్తే అన్నీ లేస్తాయి...
నేను అనే భావం అణగి పోతే అన్నీ అణగి పోతాయి...
ఎంత అణకువగా ఉంటే మనకు అంత మేలు...
మనస్సును లోబరచుకొని  ఉన్నట్లయితే
మనం ఎక్కడ, ఏ దేశంలో , ఏ ప్రాంతంలో, ఉన్నా ప్రశాంతంగా ,తృప్తిగా ,ఆనందంగా పరమాత్మ వైభవాన్ని అనుభవిస్తూ  జీవన్ముక్తి ని పొందవచ్చును..
అనగా ,జీవించి ఉండగా నే,జీవనచక్ర భ్రమణం నుండి విముక్తిని  పొందవచ్చును...

ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

శివ స్వరూపం పట్టుకుంటే అది మనకు కావలసిన సమస్తం ఇవ్వగలదు...
దానికి ఆ శక్తి  వుంది...
పరమాత్మను పట్టుకునే వాడి కోరికలు పరమాత్మే తీరుస్తాడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, June 13, 2022

శివోహం

మదిలో కలవరం కనిపించే లోకం పోకడ...
యదలో అలజడి కదిలే కాలం తీరు...
నీ ఆటలో పావును కదా
బందాల బందీకానలో బందించి , ఆశల పాశాలలో శోదించి ...
మనసును మరీ రాటుదేలుస్తున్నావు మహాదేవా...
మరో అధ్యాయానికి తెర తీస్తున్నావు...
ఏ తీరం చేర్చినా భారం భరోసా నీదే శివ...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో మహాదేవా
దేవా దయాపూర్ణభావా
నగేంద్రాత్మజా హృన్నివాసా
మహా దివ్య కైలాసవాసా
సదానంద విశ్వేశ్వరా
సర్వలోకేశ్వరా
సర్వయోగేశ్వరా
సర్వభూతేశ్వరా
నందివాహానా
భుజంగేశభూషా
త్రిశూలాయుధా
దేవదేవా శరణు.

Sunday, June 12, 2022

శివోహం

See Good
Say Good
Do Good
ఈ మూడూ చాలు పరమేశ్వరా
మనసా వాచా కర్మణా నిన్ను అనుసరించే దారి చూపించు...

మహాదేవా శంభో శరణు.

శివోహం

సదా శివుడు నీవు...
సదా తోడుగా ఉంటావని నిన్నే నమ్ముతున్నాను పరమేశ్వరా...
అన్యమేరగని నాకు అన్ని నీవే ఈశ్వరా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...