భస్మధారి...
నిర్వికారి...
దురహంకారవినాశి...
వృషభవాహనా శంకరా...
భక్తి మీరా గొలిచి రక్తి నొందెడి.....
పాపహీనులకు శుభములిచ్చే మహేశా....
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...