Friday, June 24, 2022

శివోహం

మాయలో పడి భ్రాంతి చెంది
 దేహాత్మ భావనతో దేహెంద్రియ మనోబుద్దుల స్థాయిలోనే ఉంటే ఎదుటివారిలో వికారాలే గోచరిస్తాయి.

అదే ఆత్మ సాక్షత్కారాన్ని పొంది ఆత్మభావనతో  ఉంటే ఎదుటివారిలో, అంతటా ఆత్మ ఒక్కటే గోచరిస్తుంది.

ఓం నమః శివాయ.

Thursday, June 23, 2022

శివోహం

శంభో...
విశ్వంలో నేను అణు మాత్ర పరిమాణంలో ఉన్నాను...

ఈ విపత్కర పరిస్థితుల్లో గుట్టలు గుట్టలుగా వస్తున్న నీ భక్తుల సమూహంలో నన్ను నీ ఒడిని చేర్చుకో...

ఈ సువిశాల ప్రపంచంలో ఎక్కడని వెతకను...
అంతటా ఉన్న నీవు నాలోను ఉంటావు కదా...
నిన్ను వెదికే లోపు జీవిత నాటకానికి తెర పడిపోతే నీదే భారం పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు.
సర్వేశ్వరా శరణు.

శివోహం

సత్యమనగా జగత్తును నాటకంగా ఆడించే పరమాత్మ 
అసత్యమనగా  జగత్తు పై జీవుడు పెంచుకున్న అనవసర మాయామోహం
జీవుడు జగత్తు పై తాను పెంచుకొన్న మాయా మోహం లో తగుల్కొని విలపిస్తున్నంత సేపు మనస్సుకు శాంతి లభించదు 
జీవుడి లో సత్యమైన పరమాత్మ స్వరూపం ప్రకాశించినప్పుడే మనస్సుకు శాంతి విశ్రాంతి.

ఓం శివోహం...సర్వం శివమయం.

Wednesday, June 22, 2022

శివోహం

ఉచ్వాస వద్దన్నా వెంబడిస్తున్నది...
నిశ్వాస ఎలా చేయగలను శివ...
మహాదేవా శంభో శరణు...

Tuesday, June 21, 2022

శివోహం

శంభో...
ఇకచాలయ్యా...
చాలాకాలం ఆడాను ఈ పాత్రోచిత ధర్మాలు...
ఈ ఆట ఎంతోకాలం ఆడాను...
ఎన్నో లక్షల జన్మల్లో ఆడాను...
నాకంటవు ఇక నేను నీ దరికి వస్తా...
నేను ఎదిగాను...
పాత్రచేత నేను ప్రభావితం కావడం లేదు...
నాకు పాత్రోచిత ధర్మాలు లేవు...

మహాదేవా శంభో శరణు.

శివోహం

మానవ పుర్రె ఓక కోరికల గంప దీని నింప గలవారు ఈ భూమి మీద లెడు...
ఈ కోరిక తీరింది అనుకోవడమే కొత్త కోరిక కు పునాది....
కోరికలకు అది లేదు అంతం కన్నా లేదు...
కాబట్టి కోరిక దుఃఖం కు మూలం...
ఎన్ని కొరికలో ఎన్ని దుఃఖలో...

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, June 20, 2022

శివోహం

మానవుని దేహానికి శివం అని పేరు.
శివం అనగా మంగళకరం అని మరో అర్థం. సదాలోచనలు, సచ్చింతనలతో దేహాన్ని శివంగా మార్చుకోవాలే తప్ప దుర్భావాలు,దుశ్చింతనలతో దానిని శవంగా మార్చుకోకూడదు.
దేహనికి సార్థకతను చేకూర్చే కర్మలనే చేయాలి. అపుడే భగవంతుని అనుగ్రహం పుస్కలంగా పొందవీలవుతుంది.

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...