Monday, July 4, 2022

శివోహం

నా మనసు నీ తలపులపై నిలవగా...
నీ నామము మననంతో మౌనం అలవడి...
అనుదినం నీరూపు రేఖల విభూతిని...
అనుభూతిగా ఆనందించు చున్నాము..
అలానే నా మదిలో స్థిరంగా నిలిచిపో పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నిన్నే నమ్మి తలచేనురా....
నిన్నే తలచి కొలిచేనురా...
నిన్నే కొలిచి వేడేనురా...
నిన్నే వేడి శరణంటిరా...
నమ్మి వెడాను నిన్నే తండ్రి...
నీ పాదాల చెంతకు నీవే రప్పించుకో....
నీలో ఐక్యం చేసుకో....
మహాదేవా శంభో శరణు...

Sunday, July 3, 2022

శివోహం

ఓం అంటూ స్వాగతం పలుకుతూ
నమః అని నీకు నమస్కారములు
అర్పిస్తూ, శివ అంటే ఒక్కడివే వస్తావని
శివా!(అమ్మ)య(అయ్య) అని పిలుస్తున్నాను
సతీ సమేతంగా వచ్చి మమ్మల్ని దీవిస్తావని...

మహాదేవా శంభో శరణు.

శివోహం

మనం అంతమయ్యే వరకు...
అన్ని అనుభవించాల్సిందే...
అవి  బాధలైనా ,సంతోషలైన...
ఎందుకంటే ఆపదకి  సంపద నచ్చదు...
సంపదకి బంధాలు నచ్చవు...
బంధాలకి  బాధలు నచ్చవు...
బాధలు లేని బ్రతుకే లేదు...
బ్రతుక్కి చావు నచ్చదు...
ఇన్ని నచ్ఛకున్నా మనల్ని నలుగురు మోసే వ్యక్తుల మనసులో ప్రేమ సంపాదించనప్పుడు మనం  బ్రతికివున్న శవమే కదా మిత్రమా...

ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, July 2, 2022

శివోహం

హరిహారపుత్ర అయ్యప్ప
రుద్రభూమిలో నీవీయదగినది...
నేను కోరదగినది ఒక్కటే...
నిన్ను చూస్తూ నీ సన్నిధిలో నా శేష జీవితం గడిపే రోజుకోసం ఈ జీవిత వేచి ఉన్నది...

మణికంఠ స్వామి శరణు...
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

శంభో...
బంధాలబాద్యత నడుమ ఆశపాశం నా మెడకు చుట్టి అందాలు చూపెట్టి నా కళ్ళు తెరిపించి నాలో ఆశలు పెంచకు..

దాని బదులు నా కళ్ళు మూపించి శాశ్వతంగా నా శ్వాసలు తెంచి కట్టే కొనాలకాడ నాకు మోక్షాన్ని ప్రసాదించి నీ పాదాల చెంత నాకింత చోటు కల్పించు...

మహాదేవా శంభో శరణు.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

Friday, July 1, 2022

శివోహం

నాదో నీదో చుట్టాలందరూ వదిలేసినా 
నను వీడని బంధువు నీవు...

నాలో పాపాలను దహించివేసి లోపలి 
అగ్నిని గంగలో కలిపి చల్లబరుస్తావు...

ఎన్ని చేసినా నా ఆస్తి(అస్తికలు) నాకే వదిలేస్తావు...

కాలి పొగ బూడిద సర్వం నీవే తీసేసుకొని నన్ను బంధ 
విముక్తుడను చేయి...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం...సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...