జ్ఞాన సాధన
మనం ఒక చోటకి వెళ్లాలనుకున్నాం అడ్రస్ తేలిస్తే
నేరుగా 2 లేదా 3 రోజుల్లో వెళ్లొచ్చు. కానీ నీకు చోటు తెలుసు కానీ అడ్రస్ తెలీదు అప్పుడు దారిన పోయే వారందరిని ఎటెళ్ళాలని అడుగుతూ పోవాలి, దారి తప్పితే గమ్యం చేరలేం.
అలాగే జ్ఞాన సాధన కూడా గమ్యం
చేరడానికి మార్గం తెలిస్తే ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలోనైనా గమ్యాన్ని చేరవచ్చు
ఆ మార్గాన్ని చూపే వాడే గురువు అయన చెప్పిన మాట మీద శ్రద్ధ ఆసక్తి ఉండాలి, గురువుగారు చెప్పినదే వేదం కాబట్టి గమ్యం చేరతావ లేదా అన్నది సాధన
మీద ఆధారపడి ఉంటుంది.
కొందరు గురువు లేకుండా సాధన
చేస్తే దరి తప్పే ప్రమాదముంది
గమ్యాన్ని చేరడం దుస్సాధ్యం
గురువు అనుగ్రహంతోనే అహంకారం పోయి అజ్ఞానం తొలగి పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది.