Monday, August 1, 2022

శివోహం

నా నుదుటి గీతలు వ్రాసినా దేవా దేవుడివి నీవు...
వ్రాసినవి చేరిపి తిరిగి వ్రాయగలిగినది నీవే చదవగలిగేది నీవే పరమేశ్వరా...
నా నుదుటి వ్రాత నీచేతి రాత ఎలా ఉందో చూసుకో నన్ను కాచుకో సర్వేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నా నుదుటి గీతలు వ్రాసినా దేవా దేవుడివి నీవు...
వ్రాసినవి చేరిపి తిరిగి వ్రాయగలిగినది నీవే చదవగలిగేది నీవే పరమేశ్వరా...
నా నుదుటి వ్రాత నీచేతి రాత ఎలా ఉందో చూసుకో నన్ను కాచుకో సర్వేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

Sunday, July 31, 2022

శివోహం

శివ...
నిన్ను కొలవాలంటే గుళ్లు గోపురాలు తిరగల ఏంటి...
నా మదిలో నీ గోపురామందిరాలు...
నా ఎదలో నీ సుందర రూపం నిండి ఉండగా...
ఆభావం కలకాలం నిలపవా పరమేశ్వరా..
మనసు పెట్టి ప్రార్ధించలే కానీ సర్వం శివ స్వరూపమే కదా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

నాది కాని బంధాలను తుంచి...
మరణం అనే స్పర్శతో నా ఆయువుని ముగించి...
నా అలసిన కనులకి విశ్రాంతిని కల్పించి...
నీ దరికి చేర్చుకో పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు.

Saturday, July 30, 2022

శివోహం

భక్తికి కలదు అనంత శక్తి
అది ఇచ్చును నీకు యుక్తి 
వదిలిపెట్టు నీలోని రక్తి
చివరికి దొరుకును ముక్తి

గురువుల కొలువు భక్తితో
కాపాడెదరు వారే ప్రీతితో
భజనలు చేయుము శ్రద్ధతో
పూజలు సలుపుము నిష్టతో

కలియుగం యజ్ఞ యాగాదులు 
జపతపాలు పాటించుట కష్టమే 
నామ జప మహిమ అమోఘమే  
జిహ్వపై నారాయణుని భజించు

దేవుడొక్కడే, మార్గాలు వేరే 
ఎలా పిలిచినా పలుకుతాడే 
ఆర్తితో కొలిస్తే ఆదుకొంటాడే 
భక్తి తో పిలిస్తే వచ్చితీరుతాడే 

నీలోన ఉండే నిత్య సత్యుడు
నమ్మిన వాళ్ల కొంగు బంగారం
వదలక గట్టిగా నమ్ముకో వాణ్ణి
నిశ్చల భక్తి ఒక్కటే శరణ్యం నీకు

సేకరణ:

Wednesday, July 27, 2022

శివోహం

సామాన్యుడైన
సంపన్నుడయినా
విద్యావంతుడయినా
అవిద్యావంతుడయినా
మిత్రుడయినా
శత్రువయినా
పశువయినా
పురుగయినా
నా అందరూ శివయ్యకు సమానమే

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివ...
మనసునిండా చీకటి రంగు...
కనులనిండా కన్నీటిరంగు...
బాధే బాధపడే బ్రతుకు ఇది...
దయ చూడరాదు...
నా కోరికను మన్నించారాదు...
నీ కైలాసం లో కాస్తంత చోటు కల్పించారాదు...
ఈ దినుడి మొరను అలకించరాదు

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...