భక్తికి కలదు అనంత శక్తి
అది ఇచ్చును నీకు యుక్తి
వదిలిపెట్టు నీలోని రక్తి
చివరికి దొరుకును ముక్తి
గురువుల కొలువు భక్తితో
కాపాడెదరు వారే ప్రీతితో
భజనలు చేయుము శ్రద్ధతో
పూజలు సలుపుము నిష్టతో
కలియుగం యజ్ఞ యాగాదులు
జపతపాలు పాటించుట కష్టమే
నామ జప మహిమ అమోఘమే
జిహ్వపై నారాయణుని భజించు
దేవుడొక్కడే, మార్గాలు వేరే
ఎలా పిలిచినా పలుకుతాడే
ఆర్తితో కొలిస్తే ఆదుకొంటాడే
భక్తి తో పిలిస్తే వచ్చితీరుతాడే
నీలోన ఉండే నిత్య సత్యుడు
నమ్మిన వాళ్ల కొంగు బంగారం
వదలక గట్టిగా నమ్ముకో వాణ్ణి
నిశ్చల భక్తి ఒక్కటే శరణ్యం నీకు
సేకరణ:
No comments:
Post a Comment