Tuesday, September 20, 2022

శివోహం

శివయ్యా

ఎవరిని తలస్తూ
ఉపాధి వదిలినా
వారి కోసం మళ్ళీ మళ్ళీ
జన్మించాల్సి వస్తుంది

నిన్ను తలచి ఉపాధి
వదిలితేనే
మరల మరల జన్మించాల్సిన
అవసరం రాదు

శివయ్యా నీవే దిక్కయ్యా

Sunday, September 18, 2022

శివోహం

శివా!కొండలు గుండెలు బండలైననూ
వాటియందే నీవు వసియించేవు
ఆ బండరాళ్ళనే చేరి భాసించేవు
మహేశా . . . . . శరణు .

శివోహం

స్నేహితులు
సన్నిహితులు అంటే
సమస్యలలో
తోడుగా ఉండే వారు

బంధువులు అంటే
బాధలు కలిగినపుడు
అండగా ఉండే వారు

ఆత్మీయలు అంటే
ఆవేదన ఆందోళన
అపజయాలు కలిగినపుడు
నీడలా నిలిచేవారు

ప్రేమించే వారు అంటే
మనసుని నొప్పించని వారు
కన్నీరు రానీయక
వచ్చినా తుడిచివారు

అలా లేనపుడు
ఎందరు ఉన్నా
ఒంటరివే అని మరువకు

తోడుగా నీడగా
అండగా
సఖునిగా ఆ
మహాదేవుడు ఉంటే
అంతకన్నా మహాభాగ్యము
ఏమున్నది

ఎవరు తోడుగా రాకున్నా
ఎవరు నీడలా లేకున్నా
ఎవరు ప్రేమగా చూడకున్నా
మహాదేవుని ఒడిలో
సేద పొందేలా జీవిస్తే చాలు

@శివయ్యా నీవే దిక్కయ్యా

శివోహం

శివా! కాళ్ళకు అడ్డుగా ఉంటే తన్నుకుంటూపో
కంటిచూపుకి అడ్డుగ ఉంటే కాల్చి కుప్పను చేసేయ్
ఎదోలా నీ స్పర్శ అందితే ఒక పరి అదే సరి సరి
మహేశా  . . . . . శరణు .

శివోహం

కన్నయ్య లాంటి
స్నేహితులుంటే
కుచేలుడు కూడా 
కుబేరుడు కావచ్చు

కలికాలంలో
కుబేరుల వంటి స్నేహితులు ఉన్నా
కుచేలుడు
కుచేలుడు గానే
జీవితం ముగిస్తున్నాడు

శివోహం

శివా! కాళ్ళకు అడ్డుగా ఉంటే తన్నుకుంటూపో
కంటిచూపుకి అడ్డుగ ఉంటే కాల్చి కుప్పను చేసేయ్
ఎదోలా నీ స్పర్శ అందితే ఒక పరి అదే సరి సరి
మహేశా  . . . . . శరణు .

శివోహం

మాధవున్ని
అనుకుంటాము కానీ ...

మహాదేవుని మాయలో మునుగుతున్న
మాయాలోకపు మాయాబజార్ మహిమలివి ...

శివోహం  శివోహం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...