స్నేహితులు
సన్నిహితులు అంటే
సమస్యలలో
తోడుగా ఉండే వారు
బంధువులు అంటే
బాధలు కలిగినపుడు
అండగా ఉండే వారు
ఆత్మీయలు అంటే
ఆవేదన ఆందోళన
అపజయాలు కలిగినపుడు
నీడలా నిలిచేవారు
ప్రేమించే వారు అంటే
మనసుని నొప్పించని వారు
కన్నీరు రానీయక
వచ్చినా తుడిచివారు
అలా లేనపుడు
ఎందరు ఉన్నా
ఒంటరివే అని మరువకు
తోడుగా నీడగా
అండగా
సఖునిగా ఆ
మహాదేవుడు ఉంటే
అంతకన్నా మహాభాగ్యము
ఏమున్నది
ఎవరు తోడుగా రాకున్నా
ఎవరు నీడలా లేకున్నా
ఎవరు ప్రేమగా చూడకున్నా
మహాదేవుని ఒడిలో
సేద పొందేలా జీవిస్తే చాలు
@శివయ్యా నీవే దిక్కయ్యా
No comments:
Post a Comment