Friday, November 11, 2022

శివోహం

ఈశ్వరా నీ దీపం ఇల్లుఅంత వెలుగు 
మహేశ్వర  నీ దీపం మహిమతో వెలుగు 
రత్నమాణిక్యాలు మకరకుండలాలు గల దీపారాధన చేసితిని 
అక్షయమొసగి ప్రత్యక్షమగుము
కార్తీకదీపం కళ కళ లాడాలి 
నా ఇల్లు కిలకిల లాడాలి 
కార్తిక దామోదరా కరుణించి కాపాడు...
మహాదేవా శంభో శరణు.

శివోహం

ఏ వ్యక్తి అయినా, ఏ దేశమైనా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మూడు లక్షణాలు అవసరం. అవి-
1. మంచితనానికి ఉన్న శక్తి పట్ల అఖండ విశ్వాసం.
2. అసూయ, అనుమానం లేకుండా  ఉండడం.
3. మంచిగా ఉండాలనుకునే వారికీ, మంచి చేయదలచుకునే వారికి తోడ్పడటం.

ఓం నమః శివాయ.

Thursday, November 10, 2022

శివోహం

అంతరాత్మ ఎల్లప్పుడూ దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది...
దాని నుండి తొలగిపోయి ఈ ఐహికమైన మాంసం, ఎముకలతో కూడిన పంజరం వైపు తమ దృష్టిని మరల్చి, మానవులు 'నేను', 'నేను', 'నేను' అని అంటున్నారు...
బలహీనత లన్నింటికి ఇదే మూలం...

ఓం శివోహం... సర్వం శివమయం.

Wednesday, November 9, 2022

శివోహం

శంభో...
నా కళ్ళను కప్పిన అహంకార మమకార మాయా మోహ పొరలు తొలగించు...
నీపై బుద్దిని...
నీ కథలను శ్రవణం చేసే చెవులను...
నిన్ను మాత్రమే స్తుతించే నోరును...
నీ దివ్యరూపాన్ని తిలకించేందుకు యోగ్యమైన కన్నుల చిత్తశుద్ధిని నాకు అనుగ్రహించు...
నీవు దయతో ఇచ్చిన నా ఈ జన్మకు నీవే విలువ కట్టి నీ సన్నిధిలో ఉంచుకో...

మహాదేవా శంభో శరణు...
సర్వేశ్వరా శరణు.

శివోహం

భూమి పై పుట్టి...
ఎన్నో బంధాలు అనుబంధాలతో మొదలైన నా ప్రయాణం పెళ్ళి అనే బంధంలో చిక్కి
భార్యా బిడ్డలకు ప్రేమను పంచి
స్నేహం ను పెంచి భాదను భరించి
సుఖాన్ని అందించి
అహంను తొలగించి
కోపాన్ని తగ్గించి
శాంతీని కల్పించి
నేను అనే అహంకారాన్ని వదలి
మనం అనే మమకారం తో
జాలి దయ చూపుతూ
తీపి అనుభవాన్ని పంచుతూ
చేదు అనుభవాన్ని మర్చి పోతూ
కాలంతో పాటు తిరుగతూ అలసి పోయా...
మళ్ళీ మళ్ళీ ఏ తల్లి గర్భంలోకో పంపించక ....
నీ గుండెలోనే దాచుకో తండ్రీ .....
శివోహం  శివోహం

Tuesday, November 8, 2022

శివోహం

భగవంతునిపై భక్తునికున్న ఆరాధనే కాదు,
భక్తునిపై భగవంతునికున్న అనుగ్రహం కూడా అనంతమే, అద్భుతమే.
భక్తులు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు.
భక్తునికై పరుగులు తీస్తాడు.
భక్తుని మనోభావసుధను గ్రోలి భక్తునికై సేవకుడుగా మారతాడు.
తనని సేవించే భక్తులకై పరుగులు తీసే పరమాత్మను నామ స్మరణతో ప్రసన్నం చేసుకివాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, November 7, 2022

శివోహం

శివ నామం చేయండి...
ఆస్వాదించండి...
ఆస్వాదించి ఆనందించండి...
ఆనందించి తరించండి...  ఓం నమః శివాయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...