Friday, November 18, 2022

శివోహం

శివ...
ఎంత వారలైన విధికి వంచితులే  కదా...
వెనక  వచ్చు వారెల్ల వెనక  పోవుదురు...
కాని  నీవలె అక్కున చేర్చు వారెవరు...
మా పాలిట  భాగ్యముగా  స్మరియింతుమయ్య మహేశా...
మహాదేవా శంభో శరణు.
                                          మోహన్ వి నాయక్

Thursday, November 17, 2022

శివోహం

ఏలిక నీవయ్య...
మా కూడిక నీ తొనయ్యా...
మాతో పలుక వేమయ్య...
మా ప్రార్ధనను ఆలకిన్చవయ్యా...
మమ్మేలు కోవయ్య...
మా తప్పులు మన్నిమ్చవయ్యా...
మహదేవా శంభో శరణు.
                                           మోహన్ వి నాయక్.

శివోహం

తలపులు కొలదుల భజింతురు 
నిముషము మనసున సేవింతురు
ఘనమని తలచిన ప్రేమింతురు  
మరువను నిను నా మనసున...
మహదేవా శంభో శరణు.
                                         మోహన్ వి నాయక్

Tuesday, November 15, 2022

శివోహం

నమ్మకమే బలం....
నమ్మితే ప్రకృతి అంతా పరమేశ్వరుడి  ప్రతి రూపమే...
ఓం శివోహం... సర్వం శివమయం.
ఓం నమః శివాయ...

Monday, November 14, 2022

శివోహం

నిన్ను మించిన దైవం లేదు...
నీ నామాన్ని మించిన బలం లేదు...
మహదేవా శంభో శరణు.
                                మోహన్ వి నాయక్.


శివోహం

శివ...
మనసులో ఒకమాట...
మాటల తలపు పాట...
పాట ఆట నీకోస మన్నది...
శివ నీ దయ...
                                        మోహన్ వి నాయక్.

Saturday, November 12, 2022

శివోహం

ఆయుష్మాన్ భవ...
శతాయిష్మాన్ భవ...

నీ ఉత్సాహం తేజోమయమై
నీ ఉల్లాసం కాంతిపుంజమై
నీ యవ్వనం  ఒక సంకల్పమై
నీ ప్రతి కార్యం ఒక విజయపతంగమై
నీ విజ్ఞానసంపద ఒక నూతన తేజమై
నీ ఆనందం ఒక ఆహ్లాదపు కెరటమై
మాకు నీవు ప్రియ పుత్రుడవై
నీ  గురువులకు నీవు ప్రియ శిష్యుడవై
నీ స్నేహితులకు నీవు దిక్సూచివై
భవిష్యత్తులో ఒక  రాకుమారుడులా
నీ భవితను సువిశాలంగా విస్తరింపచేస్తూ
విక్రమార్కుడువై , శ్రీమహాన్ రుద్రన్ష్ వై
నువ్వెంత ఎదిగినా   మా అందరి హృదయాలలో
చిన్ని మణికంఠ వై ,చిరకాలం చిరంజీవిగా వర్దిల్లమని
నీ జన్మ దిన శుభ సందర్బంగా శుభాశీస్సులు తెలుపు
మా హృదయ మందార దీవెనలతో...

జన్మదిన శుభాకాంక్షలు శ్రీ మహాన్ రుద్రన్ష్ నాయక్...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...