Friday, November 25, 2022

శివోహం

ధన,వాంఛ మదిలోన కలిగినప్పటి రోజు...  
నా మీద నాకు చింత కలిగి భయ దు:ఖములు చేలాగి పాపములు కలిగినప్పటి రోజు నీ మీద ప్రత్యేక  భక్తి కలుగి నీ నామచ్ఛారణ చేయ బుధ్ధి అవుతుందని చిన్న చూపు చూడకు...
నీవు తప్ప అన్యమేరగను...
శివ కుటుంబమే నా కుటుంబమని మురిసిపోతున్న..
మహాదేవా శంభో శరణు...

ప్రయాణం

చాయ్

అతిధులు ఎవరు వచ్చిన...
అలసట మన దరికి చేరిన...
సమయం గడవకున్నా...
గుర్తుకు వచ్చే పానీయం చాయ్...
రండి తాగేద్దాం...
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

Thursday, November 24, 2022

అమ్మ నీ దయ

నీవు నా అమ్మవు...
నేను నీ బిడ్డను...
భుక్తి ముక్తి ప్రదాయినివి...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.
మాత దుర్గేశ్వరి శరణు.

ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

నాలో  ఉన్న అసుర  ప్రకృతిని తగ్గించి దైవ శక్తిని  పెంచే నా నాధుడు...
సదా నా గుండెలో కొలువై ఉంటాడు...
ఈ మండలం పాటు నా హృదయం పై నాట్యమాడుతాడు....

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. 
                                          మోహన్ వి నాయక్.


శివోహం

నిన్న అన్నది ఒక జ్ఞాపకం , రేపన్నది ఒక నమ్మకం నేడు అన్నది ఒక నిజం...
నిప్పులాంటి ఆ నిజాన్ని వెలుతురుగా మార్చుకుని గమ్యం వైపు సాగాలో...
లేక..
అవిరైపోయే అబద్ధాల కోసం ఆరాటపడుతూ ఆనందించాలో మనమే  నిర్ణయించుకోవాలి మిత్రమా...
ఓం శివోహం... సర్వం శివమయం.
                                  మోహన్ వి నాయక్.           

శివోహం

భూలోకంలో  పాపపుణ్యాల భారాన్ని మోస్తున్న వాడవు నీవు...
కాలాన్ని నిరంతరం కదిలే ప్రవాహంలా సృష్టించిన వాడవు నీవు...
సుఖ దు:ఖాలతో జీవులు బ్రతకాలని సాక్షిగా నిలిచినా వాడవు నీవు...
ఆశ నిరాశల మద్య ఊగిసలాడుతున్నా నా మనసు నుండి కాపాడే ప్రాణ నాధుడివి నీవే తండ్రి...
శ్రీ శ్రీనివాస గోవిందా శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...