Sunday, December 4, 2022

శివోహం

శివుడే నా వెనుక ఉండు నడిపిస్తున్నాడు నన్ను.
నడక నాకేమి ఎరుక మరి...
నా వెనుకా ముందు ఉన్నది శివుడే....
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

ఖర్మ బంధం తీర్చు కరుణసాగారుడిని...
శరణమని పిలేచెదను...
శబరిగిరుశుని అభయమని వేడెదను...
వరమొసుగు ఈశ్వరుని మనసారా కోలేచెదను...

ఓం స్వామియే శరణం అయ్యప్ప
ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, December 3, 2022

శివోహం

తలచినాను నిన్ను నా మదిని...
తలచినాను నిన్ను నా హృదిని...
తలపులన్నీ తలపోయగ నా యెదనే నీవు...
హరిహరతనయ పంబవసా ఆయ్యప్ప శరణు...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం

Friday, December 2, 2022

శివోహం

నీ మహిమలు తెలియని మంధబుద్ధి గలవాడను...
నిన్నే కొలుస్తూ ధర్మమార్గమున నడిచే ధీనుడను...
కర్మభంధమునకు భద్దుడునై  ప్రవర్తిమ్చేవాడను...
హరిహారపుత్ర అయ్యప్ప నీవే శరణు...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

ఇదేమి విచిత్రమే శివ...
నిన్ను చూడాలంటే నే కనులు మూయలి...
నన్ను నీవు చూడాలంటే నీవు కనులు తెరువాలి...
నిన్ను చూడాలని నా మనసు ఆరాటపడుతోంది...
నా కనులు ముపించి ని దరికి చేరుస్తావో లేక నీవు కనులు తెరిచి నన్ను దర్శన మిస్తావో నీ దయ తండ్రి...
మహాదేవా శంభో శరణు.

Thursday, December 1, 2022

శివోహం

మంచి చెడ్డలు మనిషికి చెందినవి కావు
మనసుకు చెందినవి...
వాల్మీకి, భక్తకన్నప్ప మొదలగు వారు చెడునుండి
మంచిగా మారినవారే..
మారినవారు మరల మారలేదు...
కాని నేను మాత్రం నా అవసరాలకు మంచి చెడుల నడుమ నలిగిపోతున్నా...
నన్ను ఏదారిలో నడుపుతావో మణికంఠ అంత నీ దయనే...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

గమనించనే లేదు శివ...
యుగాలెన్నింటిని దాటేసానో...
కనులారా నిను చూడలేకున్న...
చలించారా నీ మొద్దు నిద్దురా...
ఇక ముగించారా మళ్ళీ మళ్ళీ ఏ తల్లి గర్భంలోకి పంపిచక...
నీ గుండె గూటిలో దాచుకో తండ్రి...

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...