Wednesday, December 7, 2022

శివోహం

శోకము, మోహము, ఆకలి  నుండి  రక్షించే  వాడవు నీవు...
అసురాదులను త్వరత్వరగా శోషింప చేయువాడవు శ్రీ మణికంఠ నీవె మా వ్యాదులనుండి రక్షించే వాడవు...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.
ఓం శివోహం... సర్వం శివమయం.

Tuesday, December 6, 2022

శివోహం

మనస్సు ఆధీనంలో  ఉంచుకునీ ధర్మంగానే నడువు...
ఏది ఏమైనా దైవ నిర్ణయమని భావించు...
దైవం నీ హృదయంలోని ఉన్నాడు...
ప్రశ్నించక ప్రార్ధించటమే నీవంతు...
కర్మానుసారం సుఖశాంతులు మెండు...
ఓ మనిషి తెలుసుకో తెలుసుకొని మసలుకో...


ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, December 4, 2022

శివోహం

శివుడే నా వెనుక ఉండు నడిపిస్తున్నాడు నన్ను.
నడక నాకేమి ఎరుక మరి...
నా వెనుకా ముందు ఉన్నది శివుడే....
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

ఖర్మ బంధం తీర్చు కరుణసాగారుడిని...
శరణమని పిలేచెదను...
శబరిగిరుశుని అభయమని వేడెదను...
వరమొసుగు ఈశ్వరుని మనసారా కోలేచెదను...

ఓం స్వామియే శరణం అయ్యప్ప
ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, December 3, 2022

శివోహం

తలచినాను నిన్ను నా మదిని...
తలచినాను నిన్ను నా హృదిని...
తలపులన్నీ తలపోయగ నా యెదనే నీవు...
హరిహరతనయ పంబవసా ఆయ్యప్ప శరణు...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం

Friday, December 2, 2022

శివోహం

నీ మహిమలు తెలియని మంధబుద్ధి గలవాడను...
నిన్నే కొలుస్తూ ధర్మమార్గమున నడిచే ధీనుడను...
కర్మభంధమునకు భద్దుడునై  ప్రవర్తిమ్చేవాడను...
హరిహారపుత్ర అయ్యప్ప నీవే శరణు...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

ఇదేమి విచిత్రమే శివ...
నిన్ను చూడాలంటే నే కనులు మూయలి...
నన్ను నీవు చూడాలంటే నీవు కనులు తెరువాలి...
నిన్ను చూడాలని నా మనసు ఆరాటపడుతోంది...
నా కనులు ముపించి ని దరికి చేరుస్తావో లేక నీవు కనులు తెరిచి నన్ను దర్శన మిస్తావో నీ దయ తండ్రి...
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...