Wednesday, December 14, 2022

శివోహం

మనస్సు నిర్మలమైన కొద్ది దాన్ని నిగ్రహించడం సులభమవుతుంది...

మనోనిగ్రహం వల్ల ఏకాగ్రత సాద్యమవుతుంది...

ఏకాగ్రత ఎంత అధికంగా ఉంటే అంత సమర్ధంగా కార్యాన్ని నిర్వహించవచ్చు.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

అమృతమే నీవు...
అద్భుతమే నీవు...
ఆనందమే నీవు...
ఆద్యంతమే నీవు...
అద్వైత్వమే నీవు....
ఓం శివోహం... సర్వం శివమయం

Tuesday, December 13, 2022

శివోహం

నను కాచే దైవం నీవేనని నీ చెంత చేరాను....
తల్లి  బిడ్డలకు ఉగ్గుపోసినట్లు.....
నీవు నాకు భక్తి మార్గమనే.....
ఉగ్గుపాలు పోసి  ప్రేమతో నన్ను పోషించి...
నీ భక్తులలో శ్రేష్ఠునిగా చేయవయ్యా మణికంఠ...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, December 12, 2022

శివోహం

అందరి యందు దాక్షిన్యము కలవాడవు...
మకరజ్యోతి వెలిగింప చేయు వాడవు...
ప్రవృత్తి,నివృత్తి, ధర్మములకు అద్యక్షుడవు...
శ్రీ మణికంఠ నీవె నక్షత్ర రూపము ధరించు వాడవు...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివ...
తెలిసో తెలియకో...
ఈ బందాలు నేనే కోరివుంటాను...
ఇచ్చేసావు నీవు...
పసిపిల్లడిని నేను అడిగితే హాలాహలం ఇవ్వవచ్చా తండ్రి...
తనయడు తప్పటడుగులు వేస్తే సరిదిద్దే బాధ్యత నీదే కదా శివ...

మహదేవా శంభో శరణు.

Sunday, December 11, 2022

శివోహం

ఒక్కసారి నీవు నీ భాదలను భగవంతుడికి చెప్పుకున్నాక అంతా అతనే చూసుకుంటడన్న నమ్మకంతో వాటిని గురించి అలోచించడం మానేయాలి. వాటిని గురించి మరళా మరళా భగవంతుడికి చెప్పనవసరం లేదు. నీ ప్రార్ధన నిజమైనదై ఉంటే అది తప్పక పరమాత్మ కు వినపడుతుంది. నీ ప్రార్ధన నిజమైనదని అతనికి కనిపించినపుడు నీ కొరకు ఏదైనా చేస్తాను. ఎంత భారమైనా సరే అతనే మెాస్తాడు..

సందేహానికి తావివ్వకు.
ఈ సృష్టినంతటినీ భరించి పోషించుచున్నవాడికి నీ భాదలు తీర్చడం పరమాత్మ కు పెద్ద సమస్య కాదు. కాకపోతే దానికి కొంత ‌సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుందనేది కేవలం నీ భక్తి విశ్వాసాలపై ఆధారిపడి ఉంటుంది.  హృదయమందు భక్తి విశ్వాసాలు అభివృద్ది పరచుకొనక భగవంతుని అనుగ్రహం కావాలనుకోవడం అజ్ఞానం,అసంభవం.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

Saturday, December 10, 2022

శివోహం

సప్తస్వర నాదవినోదిని...
సౌభాగ్య సమేత సుద్రుపిని
అఘనాషిని
నిటలాక్షిని
సర్వాలంకార సుశోభిత మంగళా కరిరాజ,రాజేశ్వరి...
అనవరతంబు నీ సేవలోనరించు  భాగ్యము 
కలిగించు జగదీశ్వరి
కరుణించు దుర్గాదేవి....

ఓం శ్రీమాత్రే నమః.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...