Friday, December 16, 2022

శివోహం

శారీరక రోగం పోవటానికి దివ్య ఔషధం అయ్యప్ప నామం...
భవరోగం పోవటానికి మంత్రోపదేశం అయ్యప్ప నామం...
సకలపాపాలు పోవటానికి నామజపం అయ్యప్ప నామం...
ఏకాగ్రతతో ప్రార్దిస్తే మణికంఠుడు తప్పక దర్సనమిస్తానన్నాడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

ఎవరైతే అచంచల  భక్తి, విశ్వాసములతో గురుపాదములను శరణు వేడుతారో వారి మంచి చెడ్డలన్నీ గురువు చూసుకుంటారు.
దేహం గురించి ఆ దేహములో ఉండే ఆత్మ గురించి ,ఆత్మలో ఉండే పరమాత్మ గురించి ఎవరి వల్ల తెలుసుకుంటామో ముందు అతనికి నమస్కరించాలి.

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, December 15, 2022

శివోహం

మన ఇష్ట ప్రకారం కాదు భగవంతుని ఇష్ట ప్రకారం మనం నడచుకోవాలి....
ఆయన సరైన దానినే మనకు ఇస్తాడు...

ఓం స్వామియే శరణం అయ్యప్ప..
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

సకల దేవతాగణములకు అధిపతి వినాయకుడు...
సకల దేవతాగణములకు అధిపతి...
అన్ని అడ్డంకులను తొలగించేవాడు...
అన్ని కార్యములకు, పూజలకు ప్రధమముగా పూజించవలసినవాడు...
విజయానికి, చదువులకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు మహా గణపతి...
ప్రాణులకు హితాన్ని బోధిస్తూ సర్వప్రకృతికి మేలుచేకూర్చే గణపతిని ఎల్లవేలలా పూజిద్దాం...

ఓం గం గణపతియే నమః.
ఓం శివోహం...సర్వం శివమయం.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

శివశివ అంటేను పాపములు తొలగించెవు
హరహర అంటేను భయములు తిరుచేవు...
పాలాభిషేకముతో నిన్ను ప్రసన్నము చేసేము...
రుద్రాభిషేకముతో నిన్ను శాంతమ్ము పరచేము...
ఓరగంటితో చూసి మా కష్టాలు తీర్చేవు...
భక్తసులబుడు ని బిరుదు నీ దయ అనంతమయ్యా...

మహదేవా శంభో శరణు.

Wednesday, December 14, 2022

శివోహం

మనస్సు నిర్మలమైన కొద్ది దాన్ని నిగ్రహించడం సులభమవుతుంది...

మనోనిగ్రహం వల్ల ఏకాగ్రత సాద్యమవుతుంది...

ఏకాగ్రత ఎంత అధికంగా ఉంటే అంత సమర్ధంగా కార్యాన్ని నిర్వహించవచ్చు.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

అమృతమే నీవు...
అద్భుతమే నీవు...
ఆనందమే నీవు...
ఆద్యంతమే నీవు...
అద్వైత్వమే నీవు....
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...