Sunday, December 18, 2022

శివోహం

నిన్నటిరోజు నీ ఆఙ్ఞతోనే గడిచింధి...
నేడు కూడా నీ అనుఙ్నతోనే నడుస్తుంధి...
రేపటిరోజు నీ ఆధీనంలోనే ఉంది...
ఋతువులు మారిన , గడియలు గడిచినా, నీ స్మరణను విడువని సంకల్పాన్ని స్థిరము చేయు భాద్యత నిదే...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు...
ఓంశివోహం... సర్వం శివమయం .

శివోహం

అదేం చిత్రమో శివ...
కంటి తడి తుడిచేసినా
గాలి తిత్తుల తడి ఆరక
నా గుండె తల్లడిల్లి పోతుంది
నిన్ను చేరుకోవాలనే కోరిక కాబోలు పరమేశ్వరా...

మహదేవా శంభో శరణు.

Saturday, December 17, 2022

శివోహం

శిక్షించడం దైవ నిర్ణయం కాదు...
పరీక్షించడమే దైవ మార్గం...
చేసిన కర్మలకు పశ్చాత్తాపం పడడమే మనిషి చేయగలిగిన కర్మమార్గం...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, December 16, 2022

గోవిందా

కోరి ఎలునట్టి   మా కులదైవమా...
మా పాపాలను తొలగించే పురుషోత్తమా
మాకు నిశ్చల భక్తి కలిగించే  బ్రహ్మతత్వమా...
శ్రీ శ్రీనివాస మా ఆశ అనే ఆకలిని తొల గించుమా.


ఓం నమో నారాయణ
ఓం నమో వెంకటేశయా నమః
ఓం నమో గోవిందయా నమః.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శారీరక రోగం పోవటానికి దివ్య ఔషధం అయ్యప్ప నామం...
భవరోగం పోవటానికి మంత్రోపదేశం అయ్యప్ప నామం...
సకలపాపాలు పోవటానికి నామజపం అయ్యప్ప నామం...
ఏకాగ్రతతో ప్రార్దిస్తే మణికంఠుడు తప్పక దర్సనమిస్తానన్నాడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

ఎవరైతే అచంచల  భక్తి, విశ్వాసములతో గురుపాదములను శరణు వేడుతారో వారి మంచి చెడ్డలన్నీ గురువు చూసుకుంటారు.
దేహం గురించి ఆ దేహములో ఉండే ఆత్మ గురించి ,ఆత్మలో ఉండే పరమాత్మ గురించి ఎవరి వల్ల తెలుసుకుంటామో ముందు అతనికి నమస్కరించాలి.

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, December 15, 2022

శివోహం

మన ఇష్ట ప్రకారం కాదు భగవంతుని ఇష్ట ప్రకారం మనం నడచుకోవాలి....
ఆయన సరైన దానినే మనకు ఇస్తాడు...

ఓం స్వామియే శరణం అయ్యప్ప..
ఓం శివోహం... సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...