Thursday, March 2, 2023

శివోహం

భగవంతుని తో ,దైవంతో ,పరమాత్మ తో , పూర్ణాత్మతో వేరుపడి, అనేక ఉపాదులలో జీవించి, చివరకు మానవ జన్మ తీసుకున్నాము. ఈ జ్జన్మలో మనం జీవిస్తూ , ఆనందంగా ఉంటూ, అనుభవాన్ని పొండుతూ ,పరమాత్మ లో ఐక్యం పొందడం ఈ ఆత్మ తత్వం.

ఓం శివోహం... సర్వం శివమయం.

Wednesday, March 1, 2023

అమ్మ

అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః

Tuesday, February 28, 2023

శివోహం

శివా!నీకు చేరువ కావాలని
నీ చెంతకు చేరాను
నీలో చేర్చుకో నీవుగా మలచుకో
మహేశా . . . . . శరణు .

శివోహం

మనిషి దేవుడి గురించి, శాంతి గురించి ప్రేమ గురించి కలగంటాడు. వాస్తవంలో యుద్ధానికి, వినాశనానికి, దౌర్జన్యానికి సిద్ధపడతాడు.నిజమైన శాంతి కాముకుడు. ఆంతరిక పరివర్తన గుండా సాగుతాడు. ధ్యానమొకటే పరివర్తనకు కారణమవుతుంది.

Monday, February 27, 2023

శివోహం

శివా!నిన్ను తెలియుటకన్న  వైరాగ్యమేది
నిన్ను చేరుటకన్న వైభవం ఏది
వైరాగ్యం విరియనీ ఆ వైభవం పొందనీ
మహేశా . . . . . శరణు .

Sunday, February 26, 2023

శివోహం

నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది...

నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు, విజయ శిఖరాలను అధి రోహింప జేస్తుంది.

ఓం నమః శివాయ.

శివోహం

శివా!నెలవంక రూపాన సిగలోని పూవుగా
సోమ నేత్రము కాస్త చిదిమి పెట్టావా
అమృతమే కురిపించె అహర్నిశము .
మహేశా . . . . . శరణు .

  https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! ఎప్పుడూ మూసి ఉండడానికి మూడు కన్నులెందుకయా ముక్కంటిశ... మాయలో మా కన్ను మూసుకొన్న...