Thursday, March 9, 2023

శివోహం

*ఆధ్యాత్మిక ఆదర్శం*
సత్యం యొక్క ప్రకాశాన్ని మన జీవితంలో అభివ్యక్తీకరించడం ద్వారా దానిని గ్రహించగలగాలి. మానవుడి ప్రథమ కర్తవ్యం వికాసం పొందటమై ఉన్నది. 

కాల క్షేప కుతూహలం అజ్ఞానం కన్నా దుర్భరమైనది. అనవసర కుతూహలంతో అక్కడకు ఇక్కడకు పరుగిడితే ఆధ్యాత్మిక పురోగమనం కుంటుపడుతుంది. 

ఆదర్శాలను సజీవంగా మనలో నిలుపుకోవాలి. ఆచరణలో చూపగలగాలి. వాటి ద్వారా మన జీవితపు మూలాలను పటిష్ఠం చేసుకోవాలి. 

మన మనస్సునీ, హృదయాన్నీ నిశ్చలమైన రాతి వలె నిలిచి ఉన్న సత్య సౌధానికి ముడివేయాలి.

శివోహం

*"మంచిమాట"*

*చిన్నా పెద్దా అనే తేడా ఎవరి విషయంలోనూ చూపకూడదు.*

*ఎవరి సహాయం ఎప్పుడు అవసరం అవుతుందో ఎవరికీ తెలియదు.*

*అందుకే అందరినీ గౌరవించాలి, ఎవరినీ తూలనాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు.*

*ఇచ్చిన మాట నిలబెట్టుకొని, చేసిన వాగ్ధానం నెరవేరిస్తే సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది.*

Wednesday, March 8, 2023

శివోహం

కనిపించని 
నా ఆదిగురువు ముందు 
నేను ఎప్పటికీ 
ఏకలవ్య శిష్యుడినే ...

ఏదో ఒకనాడు 
నా శివుడు 
నా గురుడు 
మా అమ్మతో కలిసి కనిపించకపోడా ...

ఆనాడు 
నేను ప్రేమతో ఇచ్చే 
నా పంచ ప్రాణాలను 
గురుదక్షిణగా తీసుకునిపోడా ...

శివోహం  శివోహం

శివోహం

శివా!నన్ను ఈ పురము వీడి
నీ పురము చేరి నిలువనిమ్ము
గర్భవాసము ఇంక ముగియనిమ్ము.
మహేశా . . . . . శరణు .

శివోహం

*"విషయ పరిజ్ఞానం"*

*మనకన్నా ఎన్నో రెట్లుగా విషయ పరిజ్ఞానం ఉన్న జ్ఞానుల దగ్గర మనం మితంగా మాట్లాడాలి.*

*వారు చెప్పేది శ్రద్ధగా విని మన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.*

*అంతే కాని విషయం తెలియకుండా ఎక్కువగా మాట్లాడి మన అజ్ఞానం బయట పెట్టుకోకూడదు.*

*అంటే "మనకే అన్ని విషయాలు తెలుసు" అనే అహంకారం పనికిరాదు.*
============================

Tuesday, March 7, 2023

శివోహం

శివా!అక్షయమైన నీ తేజం రూపాన్ని కూడింది
లక్షణాలు వర్ణించగ అక్షరాన  ఒదిగింది
అదే పనిగ అంటుంటే అది మంత్రమై  మెరిసింది
మహేశా . . . . . శరణు

శివోహం

శివా ! నీవు మంచు పానుపుల్లో నివసిస్తూ 
సుఖాల పరుపులపై నను పరుండ బెట్టావు 
నా కష్టాలు నీ గరళం లో ఉంచేసిన 
నీ బాధ నాకు తెలియకుండా 
నీ ముఖమంతా పున్నమి చంద్రుడల్లే నవ్వేసిన 
నిను చూసి సంబరపడిన నా తల్లి పార్వతి 
నీ తలపై అష్టమి చంద్రుడిలా వెలిగిపోతోంది చూశావా 
శివా ! నీ దయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...