Thursday, March 16, 2023

శివోహం

శివా!ఈ దేహం కల్పించావు
అందులోనే వసియిస్తున్నావు
ఆ వాసమెన్నాళ్ళో తెలియనీవు
మహేశా . . . . . శరణు .

Tuesday, March 14, 2023

శివోహం

శివా!నీ స్మరణ సాగనీ మరణం వరకు
ఆ మరణం ముగియనీ ఈ మరణంతో
హరణం కానీ జననం,నీ చరణే శరణం
మహేశా . . . . . శరణు .

మౌనం మహోన్నతం


 మౌనం అత్యంత పాటవమైన పని. వేదవేదాంతాలు సత్యాన్ని గురించి ఎంతో వర్ణిస్తాయి, ఘోషిస్తాయి. చివరికి ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అని శాంతించి మౌనాన్ని వహిస్తాయి. అప్పుడు అసలు వర్ణన మొదలవుతుంది. సత్య గురువు మౌనంగా, స్వరూపంగా ఉంటాడు

ఎక్కడలేని శాస్ర్తాల, గ్రంథాల సారమంతా సద్గురువు మౌనానికి సాటిరావు. గురువు మౌనం, నిశ్చలత ఎంతో విశాలం, విస్తారం! మౌనం శక్తిపూర్ణమైనది. అది అందరి హృదయాలనూ పరివర్తనం చేస్తుంది. అజ్ఞాని తన ఆత్మను శరీరంగా భావించి, అలాగే ఇంకో శరీరాన్ని గురువు అనుకుంటాడు. కానీ, గురువు తాను దేహమని భావిస్తాడా? ఆయన శరీరానికి అతీతుడు. ఆయనకు భేదాలేం ఉండవు. ఆయన మౌనమే మహోన్నత ఉపదేశం.

– భగవాన్‌ రమణ మహర్షి

Monday, March 13, 2023

శివోహం

*"మంచిమాట"*

*ధైర్యం విడిచి ప్రయత్నం మానుకున్న వాళ్ళకు ఏ పనీ సాగదు.*

*ఉత్సాహమే బలం, ఉత్సాహంకంటే లోకంలో మరో బలమే లేదు.*

*ఉత్సాహవంతునకు అసాధ్యం ఏమీ లేదు, ఉత్సాహంగల వాళ్ళు ఏ పని చేసినా అపజయం పొందరు.*
============================

శివోహం

శివా!ప్రవృత్తి మార్గానికై నన్ను పుడమికంపి
నివృత్తి మార్గాన నన్ను కూడమన్నావు
ఏ వృత్తి  ఎంచుకోను నా తృప్తి పెంచుకోను .
మహేశా . . . . . శరణు .

శివోహం

భగవంతుడిని ప్రేమించడం భక్తికి తార్కాణం. ఆయన కోసం అర్రులు చాచడం, ఆరాట పడటం, ఏడ్వటం, బాధ పడటం… అన్నీ భక్తికి నిదర్శనాలే. భగవంతుడికి అన్నీ అర్పించడమే భక్తి. కలిమి లేముల్లో, సుఖదుఃఖాల్లో… ఒకటేమిటి ప్రతిస్థితిలో, ప్రతి అవస్థలో, అన్ని వ్యవస్థల్లో, అంతటిలో భగవంతుడిని చూడగలగడమే భక్తి. అనుక్షణం అణువణువునా పరమాత్మను హృదయంలో దర్శించడం భక్తి అవుతుంది. భగవంతుడిని అనుభవించటం భక్తి. అనుభవంలోకి తెచ్చుకోవటం భక్తి.

నిజమైన భక్తి

నిజమైన భక్తి భగవంతుడిని ప్రేమించడం భక్తికి తార్కాణం. ఆయన కోసం అర్రులు చాచడం, ఆరాట పడటం, ఏడ్వటం, బాధ పడటం... అన్నీ భక్తికి నిదర్శనాలే.
భక్తి అనేది ఓ మధురమైన భావన.
భగవంతుడి కోసం తన అనుకున్న సర్వస్వాన్నీ అర్పించటమే భక్తి.
నిజమైన భక్తి అనుభవైకవేద్యమైనదే తప్ప ఇదీ అని చెప్పగలిగేది కాదు.
అందుకే నిజమైన భక్తుడు నిరంతరం సాధన చేస్తూనే ఉంటాడు.

భగవంతుడిని ప్రేమించడం భక్తికి తార్కాణం. ఆయన కోసం అర్రులు చాచడం, ఆరాట పడటం, ఏడ్వటం, బాధ పడటం… అన్నీ భక్తికి నిదర్శనాలే. భగవంతుడికి అన్నీ అర్పించడమే భక్తి. కలిమి లేముల్లో, సుఖదుఃఖాల్లో… ఒకటేమిటి ప్రతిస్థితిలో, ప్రతి అవస్థలో, అన్ని వ్యవస్థల్లో, అంతటిలో భగవంతుడిని చూడగలగడమే భక్తి. అనుక్షణం అణువణువునా పరమాత్మను హృదయంలో దర్శించడం భక్తి అవుతుంది. భగవంతుడిని అనుభవించటం భక్తి. అనుభవంలోకి తెచ్చుకోవటం భక్తి.

తమ మనస్సుకు నచ్చిన ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు తమకు తోచిన రీతిలో ప్రార్థిస్తుంటారు. మంత్రాలు పఠిస్తారు. పూజలు, జపాలు చేస్తారు. ఇంకొంతమంది కోరికలు నెరవేరడానికి ఉపవాసాలు ఉంటుంటారు. వ్రతాలు చేస్తుంటారు. ఇవన్నీ భక్తి కలిగిన వారు చేసే వివిధ సాధనా మార్గాలు మాత్రమే. అంతేకానీ పరిపూర్ణ భక్తికి ప్రతీకలు మాత్రం కావు. భగవంతుడిని ఆరాధించే కొద్దిసేపైనా ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా మనసా వాచా కర్మణా భగవంతునిపైనే మనసును లగ్నం చేసి తనను తాను భగవంతుడికి అర్పణ చేసుకోవడమే అసలైన భక్తి అవుతుంది. ఇటువంటి భక్తి అత్యంత అమోఘమైంది. భగవంతుడికి భక్తులను దగ్గర చేసేది ఇటువంటి భక్తి మార్గం మాత్రమే.

భగవంతుడిని మనసా స్మరిస్తూ, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి. ఏమీ ఆశించకుండా, కేవలం ఆ సర్వేశ్వరుడిని స్మరించడమే భక్తి. రాముడిపై హనుమంతుడికి ఉండేది భక్తి. శివుడిపై నందీశ్వరునికి ఉండేది భక్తి. గురువుపై శిష్యునికి ఉండేది భక్తి. భగవంతుడి తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండెలోతుల నుంచీ పొంగుకొస్తుంది. ఆయన మీద విశ్వాసం ఉన్న వారు చేసే ప్రతీ పనిలోనూ భక్తి అంతర్లీనంగా ఉంటుంది.

భక్తి అంటే భగవంతుని వద్దకు వెళ్లి మన కోర్కెల చిట్టా చదవటం కాదు. ముడుపుల పేరుతో దేవుడితో లావాదేవీలు జరపడం అంతకన్నా కాదు. ఇవన్నీ కేవలం సాధనా మార్గాలు మాత్రమే. కోర్కెల గురించి మాత్రమే సర్వాంతర్యామిని ప్రార్థించాలనుకునేవారికి అసలు భక్తితత్వం బోధపడలేదని తెలుసుకోవాలి. పరమాత్మ సర్వాంతర్యామి. ఆయనకు తెలియనిది లేదు. అలాంటి సర్వవ్యాపకుడికి మన కోర్కెలు తెలిపి, ‘ఇదీ నా ఫలానా అవసరం, దాన్ని తీర్చు’ అని చెప్పుకోవడం హాస్యాస్పదమే కదా! మనతోపాటు, మన భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్ని సృష్టించిన ఆ దేవదేవుడికి, మనకు ఏం కావాలో ఏం అక్కర్లేదో తెలియదా..?

భగవంతుడిపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉండాలి. మరి భగవంతుడి గురించి ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెబుతారు? అనే ప్రశ్న ఉదయించినప్పుడే ఆలోచన, సాధన మొదలవుతాయి. అవే క్రమంగా పరిశోధనగా మారతాయి. నచికేతుడి తండ్రి వాజశ్రవుడు. అతడు విశ్వజిత్‌ అనే యాగం చేస్తూ అందులో భాగంగా అనేక దానాలు చేస్తుంటాడు. తండ్రి చేస్తున్న దానాల్ని గమనించిన నచికేతుడు ‘నాన్నా! నన్ను ఎవరికి దానం చేస్తావు?’ అని అడిగాడు. యాగ పనులతో తీరికలేకుండా ఉన్న వాజశ్రవుడు పిల్లవాడి మాటలకు విసుగెత్తి ‘నిన్ను యముడికి దానం ఇచ్చాను’ అన్నాడు. వెంటనే నచికేతుడు తనను తాను సమర్పించుకునేందుకు యముడి వద్దకు వెళ్లాడు.

యముడు పిల్లాడిని చూసి ముచ్చటపడి మూడు వరాలు ఇస్తానంటాడు. అందులో ఒక వరంగా బ్రహ్మజ్ఞానం గురించి చెప్పమంటాడు నచికేతుడు. పసిబాలుడు ఊహించని వరం కోరేసరికి ఆశ్చర్యపోతాడు యముడు. అనేక ఆశలు చూపించి అతని దృష్టి మరల్చాలని చూస్తాడు. కానీ, నచికేతుడు దేనికీ లొంగడు. తన ప్రశ్నకు సమాధానం కావాలని పట్టుబడతాడు. బాలుడి పట్టుదలకు సంతోషించిన యముడు అతడికి బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు. అదే కఠోపనిషత్తుగా అవతరించి అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నది. ఇలా తెలుసుకోవాలన్న తపన ప్రశ్నించిన భక్తుడితోపాటు మనందరినీ తరింపజేసింది.

భగవంతుని పొందడానికి భాగవతంలో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇలా తొమ్మిది రకాల మార్గాలు సూచించారు. ఇవే నవవిధ భక్తిమార్గాలుగా ప్రసిద్ధి. ఏ మార్గాన్ని ఎంచుకున్నా అంతిమంగా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. నిర్మలమైన భక్తికి భగవంతుడి అందదండలు ఉంటాయి. నిశ్చలమైన భక్తుడికి స్వామి కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది.

దేవుణ్ని ప్రశ్నిస్తే…?

భక్తి ఉన్నంత మాత్రాన ప్రశ్నించకూడదనేమీ లేదు. ప్రశ్నకు తగిన సమాధానం దొరికితే భక్తి మరింత పెరుగుతుంది. కార్యకారణ సంబంధాలను విశ్లేషించిన తరువాత ఏర్పడే భక్తిలో గాఢత ఎక్కువగా ఉంటుంది. కొడుకుకు ఏదైనా సందేహం వస్తే తండ్రిని ప్రశ్నిస్తాడు కదా! అనుమానం నివృత్తి చేసుకుంటాడు కదా! మరి జగత్తుకు తండ్రి అయిన దేవుడిని ప్రశ్నిస్తే మాత్రం తప్పేముంది. దేవుడు కూడా తనను నిలదీసే భక్తులను ఎక్కువ అనుగ్రహిస్తాడు. కత్తి పదునుతేలాలి అంటే సానబెట్టాలి. భక్తికీ అంతే! ఆటవికుడైన తిన్నడు పరమశివుడిని అంత తేలిగ్గా నమ్మలేదు. ‘అసలు నువ్వెవరు?’ అని ప్రశ్నించాడు. ‘నీ జాడ ఎక్కడ?’ అని నిలదీశాడు. భగవంతుడి జాడను తెలుసుకున్నాకే విశ్వసించాడు. పరమ భక్తుడిగా మారాడు. భాగవతం రాసిన పోతనామాత్యుడు పరమ భాగవతోత్తముడు. అయితేనేం. ఆయన దేవుడి గురించి బోలెడన్ని ప్రశ్నలు సంధించాడు.

డా॥ కప్పగంతు రామకృష్ణ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...