Saturday, March 18, 2023

శివోహం

ఈ శరీరంలో 'నేను' అంటూ లేచేదే మనస్సు.
ఎవరైనా అసలు ఈ 'నేను' అన్న తలంపు
ఎక్కడ నుంచి వస్తుందో అని విచారణ చేస్తే
అది హృదయం నుంచి
ఉద్బవిస్తుంది అని కనుగొంటారు.

మనస్సునుంచి వచ్చి అన్ని ఆలోచనలలోకి
'నేను' అనే తలంపే మొదటిది.
ఇది లేచిన తరువాతనే ఇతర తలంపులు వస్తాయి.

శ్రీరామ

*"ఉత్సాహం"*

*ఉత్సాహం ఉంటే సకల సంపదలూ సాధించవచ్చు.*

*ఉత్సాహమే సుఖం.*

*ఏ కార్యం అయినా ఉత్సాహం ఉంటేనే నెరవేరుతుంది.*

*ఉత్సాహం ఉంటే ఎవరేమి చేసినా తప్పకుండా నెరవేరుతుంది.*
============================

Friday, March 17, 2023

శివోహం

శివా!నమక చమకాల నీకు లాల పోసి
ఉఛ్వాస నిశ్వాసాల ఊయలూపి
నిదురబుచ్చగ నేను భ్రమసినాను
మహేశా . . . . . శరణు .

Thursday, March 16, 2023

శివోహం

శివా!ఈ దేహం కల్పించావు
అందులోనే వసియిస్తున్నావు
ఆ వాసమెన్నాళ్ళో తెలియనీవు
మహేశా . . . . . శరణు .

Tuesday, March 14, 2023

శివోహం

శివా!నీ స్మరణ సాగనీ మరణం వరకు
ఆ మరణం ముగియనీ ఈ మరణంతో
హరణం కానీ జననం,నీ చరణే శరణం
మహేశా . . . . . శరణు .

మౌనం మహోన్నతం


 మౌనం అత్యంత పాటవమైన పని. వేదవేదాంతాలు సత్యాన్ని గురించి ఎంతో వర్ణిస్తాయి, ఘోషిస్తాయి. చివరికి ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అని శాంతించి మౌనాన్ని వహిస్తాయి. అప్పుడు అసలు వర్ణన మొదలవుతుంది. సత్య గురువు మౌనంగా, స్వరూపంగా ఉంటాడు

ఎక్కడలేని శాస్ర్తాల, గ్రంథాల సారమంతా సద్గురువు మౌనానికి సాటిరావు. గురువు మౌనం, నిశ్చలత ఎంతో విశాలం, విస్తారం! మౌనం శక్తిపూర్ణమైనది. అది అందరి హృదయాలనూ పరివర్తనం చేస్తుంది. అజ్ఞాని తన ఆత్మను శరీరంగా భావించి, అలాగే ఇంకో శరీరాన్ని గురువు అనుకుంటాడు. కానీ, గురువు తాను దేహమని భావిస్తాడా? ఆయన శరీరానికి అతీతుడు. ఆయనకు భేదాలేం ఉండవు. ఆయన మౌనమే మహోన్నత ఉపదేశం.

– భగవాన్‌ రమణ మహర్షి

Monday, March 13, 2023

శివోహం

*"మంచిమాట"*

*ధైర్యం విడిచి ప్రయత్నం మానుకున్న వాళ్ళకు ఏ పనీ సాగదు.*

*ఉత్సాహమే బలం, ఉత్సాహంకంటే లోకంలో మరో బలమే లేదు.*

*ఉత్సాహవంతునకు అసాధ్యం ఏమీ లేదు, ఉత్సాహంగల వాళ్ళు ఏ పని చేసినా అపజయం పొందరు.*
============================

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.