Monday, March 20, 2023

శివోహం

పట్టరాని దుఃఖం వచ్చిందని జుట్టు పీక్కోవడం ఎందుకు?
దాని వలన ఏమైనా బాధ తగ్గుతుందా ఏమిటి?
ప్రశాంతంగా ఆ దుఃఖాన్ని స్వీకరిస్తే, జుట్టూ మిగులుతుంది, బాధా కనుమరుగు అవుతుంది, మార్గాంతరమూ కనిపిస్తుంది.
దుఃఖాన్ని స్వీకరించడం ఎలాగో తెలిసిన వారికే, సుఖాన్ని ఎలా అనుభవించాలో తెలుస్తుంది.

శివోహం

శరీరాలు శాశ్వతం కావు...
సంపదయూ స్థిరం కాదు...
మృత్యువు ఎల్లప్పుడూ సమీపంలోనే ఉండును...
కావున ధర్మం ప్రకారం నడచి పుణ్యం ఆర్జించాలి.

ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, March 19, 2023

శివోహం

శివా!ఈ బ్రతుకు ముగిస్తే బూడిద కుప్పే
అది నీ దేహాన మెరిస్తే బ్రతుక్కి మెప్పే
ఆ రీతి ఒప్పనీ , నీ మెప్పు పొందనీ 
మహేశా ..... శరణు.

శివోహం

శరీరం అలసిపోతే మరణం...
మనసు అలసిపోతే లయం...
జీవన్ముక్తి నిలయం వినీల గ్రహణం విశుద్ధ సత్వం...
భౌతిక యంత్రం ఆగిపోతే చింతన,యాతన...
మనో తంత్రం ఆగిపోతే దుఃఖ నిర్మూలన చిదానంద ధారణ శోక నివారణ పునరావృత హరణ.

ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, March 18, 2023

శివోహం

శివా!కన్ను విచ్చుకోక
మనసు చచ్చిపోక
మోక్షం ఎఱుక కాదు.
మహేశా ..... శరణు .

శివోహం

నీ ప్రణవమై ప్రస్తుతించనీ
నీ ప్రళయమై లయము చెందనీ
నీ కోసమై జననమెత్తనీ
నీ తోడుగా మరణమొందనీ ...

నీ జపముకై జీవమవ్వనీ
నీ తపముకై తనువునవ్వనీ 
నీ మంత్రమై మదిని చేరనీ 
నీ భావమై బంధమవ్వనీ ...

నీ గుర్తునై గుడిని చేరనీ 
నీ తలపునై తలుపు తట్టనీ 
నీ గానమై గుండె చేరనీ 
నీ పాటనై పదము కోరనీ ...

నీ శ్లోకమై శోధనవ్వనీ 
నీ శోకమై శరణమవ్వనీ 
నీ ధ్యాసనై ధ్యానమవ్వనీ
నీ మాటనై మవునమవ్వనీ ...

నీ కరుణకై కాటి చేరనీ 
నీ చెలిమికై చితిని చేరనీ 
నీ ప్రాణమై ప్రమిదనవ్వనీ 
నీ దేహమై దగ్ధమవ్వనీ ...

హరహర మహాదేవ
శివోహం  శివోహం

శివోహం

ఈ శరీరంలో 'నేను' అంటూ లేచేదే మనస్సు.
ఎవరైనా అసలు ఈ 'నేను' అన్న తలంపు
ఎక్కడ నుంచి వస్తుందో అని విచారణ చేస్తే
అది హృదయం నుంచి
ఉద్బవిస్తుంది అని కనుగొంటారు.

మనస్సునుంచి వచ్చి అన్ని ఆలోచనలలోకి
'నేను' అనే తలంపే మొదటిది.
ఇది లేచిన తరువాతనే ఇతర తలంపులు వస్తాయి.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...