Sunday, April 2, 2023

శివోహం

శివా!నిను చేరు నా పయనంలో
అడుగు అడుగున నీ స్మరణమే
ప్రతి బంధమూ ప్రతిబంధకమే..
మహేశా . . . . . శరణు .

శివోహం

*"మంచిమాటలు"*

ఉత్తముడు తాను పొందిన స్వల్పమైన ఉపకారానికి కూడా ప్రత్యుపకారం చేయడానికి వేచి ఉంటాడు.

అన్నదానం భ్రూణ హత్యా దోషాన్ని కూడా తుడిచివేస్తుంది.

సదాచారం (సత్ప్రవర్తన) వల్ల ఆయుర్దాయం, కీర్తి, శ్రేయస్సు వృద్ధి పొందుతాయి.

ప్రియంగా మాట్లాడే వారికి శత్రువులు ఉండరు.

కారణం లేకుండా ఇతరుల ఇంట్లోకి వెళ్ళకూడదు.

శివోహం

భగవంతుని తత్వం

భగవంతుని పై చూపే ప్రేమనే భక్తి అని అనుకోవచ్చు. భగవంతుడు లేనిప్రదేశం లేదు అంటారు. భగవంతుడు సర్వభూతములలో అంతర్భూతమై ఉంటాడు కనుక సర్వప్రాణులపైన ప్రేమ భావన కల్గి ఉండడం, సర్వపాణులపై సమదృష్టి కలిగి ఉండడమూ భగవంతునిపై ప్రేమ చూపించడమే. అంటే భగవంతునిపై భక్తిని కలిగి ఉండడమే. ఇటువంటి భక్తి ప్రతిమనిషిలో అంకురించాలి అంటే దేవాలయ సందర్శనాలు మార్గాలుగా ఉంటాయ. అక్కడ బోధించే ప్రతివిషయమూ మనిషిని మంచినడవడిలో నడిపించేట్టు చేస్తాయ.
కేవలం గుడికి వెళ్లడం దర్శనం ఛేసుకోవడమే భక్తి కాదు అక్కడ అర్చనాదులు నిర్వహించడవమే భక్తి అని అనలేము. భగవంతునిపై భక్తి అంటే భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతునికి మారురూపులుగా ఉండాలి.
దేవాలయాలు విద్యాకేంద్రాలు. అక్కడ చెప్పే పురాణ పురుషుల జీవితాలలోనో, లేక గీత బోధనో పెద్ద వారి అనుభవాలనో లేదా రామాయణ మహాభారత సన్నివేశాలో సంఘటనలనో ప్రవచనాలుగా వినిపిస్తుంటారు. వాటిని విన్నవారికి అవి జీవిత పాఠాలుగా పనికి వస్తాయ.
గుడికి వచ్చేవారికి ప్రసాదరూపంలో ఆహారం పెడుతుంటారు. ఆహారం రైతు పండించినా అది ప్రతిమనిషికి చేరేలోపు ఎందరి చేతుల్లోకి మారి వస్తుంటుంది. రైతును దేశానికి వెన్నుముకే కాదు భగవంతునికి ప్రతిరూపు కూడా.్భగవంతుడిచ్చిన గాలి, వెలుతురు, నీరు ఇలాంటి వాటిని ఉపయోగించి పండించిన పంటను తిరిగి దేవునికి సమర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకోమనే బోధ ఈ ప్రసాదరూపంలో అందుతుంది. అంతేకాదు ఉన్న ప్రసాదాన్ని నలుగురు కలసి పంచుకొని తినడంలోను ఐకమత్యం చూపించాలనే ప్రసాద వితరణలో కనిపిస్తుంది.
గుడిని పరిశ్రుభంగా ఉంచడంలో పరిసరాల శుభ్రత ఆరోగ్యాన్ని భద్రతనేర్ప రుస్తుంది అనేది కూడా ఈ దేవాలయాలు చెబుతుంటాయ.ఇన్ని విషయాలను బోధించే చైతన్యాలయాలు దేవాలయాలు కనుక అక్కడ కేవలం దేవుని దర్శనమే కాకుంఢా భగవంతుని తత్వాన్ని తెలుసుకొని జీవితాన్ని బాగుచేసుకోమని ప్రతివీధిలోను మన పూర్వులు ఓ దేవాలయాన్ని నిర్మించారు .
అందువల్లనే భారతీయులల్లోని ప్రతి ఇంట్లో వేకువ జామున వేసే ముగ్గు దగ్గర నుంచి చీమలకు పెట్టే నూక వరకు అన్నీ ఇతరులకు కాస్త సాయం చేయమని, ఉన్నదానిలోతృప్తిగా జీవించమనే సందేశం వినిపిస్తుంది

Saturday, April 1, 2023

శివోహం

మనిషి సర్వజ్ఞుడు కాదు తప్పు చేయడం సహజం...
ఎంత జ్ఞాని యైన తప్పు చేసేందుకు అవకాశం వుంది...
తప్పులన్ని తెలియక చేసేవే యెవరైన సత్యం చెప్పాలంటే దైవం దృష్ఠిలో అందరు క్షమార్హులే...
కనుక ఏ మనిషి క్షమా హృదయం కలిగి వున్నాడో, వారు ధన్యులు...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!తెరను తొలగించు ఆవల అగుపించు
తేరును నడిపించు తీరును ఎరిగించు
నీవుగ అనిపించు నేనును తెలిపించు
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!తెరను తొలగించు ఆవల అగుపించు
తేరును నడిపించు తీరును ఎరిగించు
నీవుగ అనిపించు నేనును తెలిపించు
మహేశా . . . . . శరణు .

శివోహం

భక్తుని కర్తవ్య విధులు...

భగవంతుని శరణుకోరిన వారు తమ జీవితంలో జరిగే మంచిచెడులన్నీ భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగుతున్నాయని భావిం చాలి. తమకు కలిగిన సంతోషాన్ని ఎవరితో అయినా పంచుకోవచ్చు కానీ కష్టాలను, బాధల ను ఎవరికీ చెప్పుకోకూడదు. బాధపడకూడదు. ఎవరి కైనా చెప్పుకుంటే మనోభారం తగ్గుతుం దని భావించి ఇతరుల వద్ద వెల్లడిస్తారు. అలా చేస్తే కష్టాలకు లొంగిపోవడమే అవుతుందని అంటారు మన భాష్యకారులు. మానవ జీవితం లో ఎదురయ్యే ఒడిదుడుకులకు తలొగ్గకుండా తమ జీవన కర్తవ్యాన్ని నెరవేర్చాలని చెబుతా యి మన ఇతిహా సాలు. నిజమైన భక్తులు ఎలా వుండాలి? తమ విధులను ఎలా నిర్వర్తించాలో తెలుసుకుందాం.
చేసే ప్రతి పనిని భగవంతుని సేవగా భావించి చేయాలి. భగవంతుని సేవలో నిమగ్నమైన గొప్ప భక్తులను కూడా చిత్తశుద్ధితో సేవించాలి. వారి నుంచి భాష్యాలను అధ్యయనం చేయాలి. వాటిని మానవాళి ప్రయోజనం కోసం ప్రతిచో టా ప్రచారం చేయాలి.
దైనందిన కార్యక్రమాల్లో ఎంత బిజీగా వున్నా 24 గంటల సమయంలో కొంత సమ యం ఆలయాల పరిశుభ్రత, నిర్వహణకు కేటా యించాలి. స్వామివారి పుష్పాలు, అలంకరణ లు నైవేద్యాలు… ఇలా చేతనైన సేవ చేసుకోండి.
భక్తులు కానివారి ఇళ్లలో సమర్పించే ప్రసాద మైనా, తీర్థమైనా స్వీకరించకూడదు.
విష్ణు దేవాలయంలో భగవంతుని సన్నిధిలో ఉంటే భక్తులు కానివారు చుట్టూ ఉన్నా తీర్థం, ప్రసాదం తీసుకోవచ్చు.
పవిత్ర స్థలంలో తీర్థం, ప్రసాదాలను ఎట్టి పరి స్థితుల్లోనూ తిరస్కరించకూడదు. ఉపవాసం ఉన్నప్పటికీ దేవాలయాలలో తీర్థం, ప్రసాదాల ను తిరస్కరించకూడదు.
భక్తులు కాని వారి ఇళ్ళల్లోని పటాలను పూజించకూడదు.
భక్తుడు అవమానించినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎదురు తిరిగే ప్రయత్నం చేయకూడదు.
శాశ్వతమైన ఆనందాన్ని పొందాలనే తపన ఉన్నవారు భక్తులందరి క్షేమం కోసం ప్రయత్నించాలి.
భెగవంతునికి శరణాగతి చేసిన తర్వాత కొన్ని సుఖాలు పొందినప్పటికీ, దైవసంక ల్పానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు.
తినే ఆహారమంతా ముందుగా భగవం తునికే సమర్పించాలి. పువ్వులు, పండ్లు, సువాసనలు, ఇలాంటి వాటిని మొదట భగ వంతుడికి అంకితం చేయకుండా తీసుకో కూడదు.
భగవంతునికి సమర్పించే నైవేద్యాన్ని ఒకరి వ్యక్తిగత అభిరుచిని బట్టి ఎంపిక చేసుకో కూడదు.
భగవంతునికి సమర్పించే నైవేద్యం తాజాగా ఉండాలి. ఆరోజు తయారుచేసిన పదార్థాలనే నైవేద్యంగా సమర్పించాలి. రాత్రి చేసిన వంట కాలను మరుసటిరోజు ఉదయం నైవేద్యంగా పెట్టకూడదు.
దేవునికి సమర్పించిన సమస్త నైవేద్యాలను అందరికి పంచిపెట్టాలి. ఒక్కరే తినకూడదు.
భెక్తులు ఇతరులు చూసిన లేదా రుచి చూసిన ఆహారాన్ని తినకూడదు.
భక్తి లేనివారు దానం చేసినా, ధనం ఇచ్చినా, విలువైన వస్తువులు అడగకుండా ఇచ్చినా తీసు కోకూడదు.
శాస్త్రాలు నిర్దేశించిన అన్ని ఆచారాలు వేడుక లు అత్యంత అంకిత భావంతో, శరణాగతి, స్ఫూర్తితో చేయాలి.
దేవాలయం లేదా భగవంతుని సన్నిధిని సూ చించే ఇతర నిర్మాణాలను దాటి వెళ్ళేటప్పుడు వాటి ముందు భక్తితో నమస్కరించా లి.
³భెక్తులను అవమానించడం ఆత్మ వినాశనా నికి దారితీస్తుంది.
భగవాన్‌ (భగవంతుడు), భాగవతాలు (భక్తు లు) ఇద్దరికీ సేవ చేయకుండా ఒక వ్యక్తి ఎప్పటికి ముక్తిని పొందలేడు.
భగవంతుని (భగవాన్‌) ఆరాధనకంటే భక్తుల (భాగవత) ఆరాధన శ్రేష్టమైనది. భక్తుని తీర్థ ము, ప్రసాదము భగవంతునికంటే శ్రేష్టమైనది.
భగవంతుడు, భక్తులు లేదా ఆచార్యుల సమక్షంలో మర్యాద పూర్వకంగా, గౌరవప్ర దంగా కూర్చోవాలి.
జ్ఞానం, భక్తి, వైరాగ్యం కలిగిన భక్తులు వారు పుట్టిన సామాజిక వర్గం లేదా కులంతో సంబం ధం లేకుండా గౌరవించబడాలి.
ఇతరుల గురించి పదేపదే చెడుగా మాట్లాడే వారితో సహవాసం చేయకండి. ఇతరులను దూషించడం మానండి.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...