Sunday, April 2, 2023

శివోహం

భగవంతుని స్మరించడానికి సమయమే ఉండదు...
ఇలా సమయం దొరకడం లేదని వాపోయేవారు ఒక్కసారి తమని తాము పరిశీలించుకొండి...
తమ దినచర్యలో ఎంత సమయాన్ని అనవసర విషయాలకై వృధా చేస్తున్నారో గమనించండి.
ఫోన్ మాట్లాడడానికి, టి.వి చూడడానికి, షికార్లు తిరగడానికి, కాలక్షేప కబుర్లుకు సమయముంటుంది కానీ, భగవన్నామ స్మరణకు మాత్రం సమయం ఉండదు కదా.
ఒకటి గుర్తించండి - గృహస్థులు రోజులో కొద్దిసమయం సాధనకు కేటాయిస్తే వచ్చే ఫలితం, రోజంతా సాధన చేసే సాధువుల ఫలితంకు సమానంగానే వుంటుంది. 'నిరంతరం భగవన్నామన్ని గానం చేసే నారదుడి కన్నా, ఉదయం నిద్ర లేస్తున్నే ఓసారి, తింటున్నప్పుడు ఓసారి, రాత్రి నిద్రపోయేటప్పుడు ఓసారి భగవన్నామన్ని స్మరించే రైతు గొప్పవాడు' అని పెద్దలు చెప్పిన కధ గుర్తు చేసుకొండి. మనస్సుంటే మార్గం వుండదా? అభ్యాసం చేస్తే ఏది సాధ్యం కాకపోదు. సంసార విధులను నిర్వర్తిస్తూ కూడా, మనస్సును భగవంతునిపై ఉంచడం అలవర్చుకోవచ్చు...
ప్రయత్నించండి మరి. 

శివోహం

శివా!నిను చేరు నా పయనంలో
అడుగు అడుగున నీ స్మరణమే
ప్రతి బంధమూ ప్రతిబంధకమే..
మహేశా . . . . . శరణు .

శివోహం

*"మంచిమాటలు"*

ఉత్తముడు తాను పొందిన స్వల్పమైన ఉపకారానికి కూడా ప్రత్యుపకారం చేయడానికి వేచి ఉంటాడు.

అన్నదానం భ్రూణ హత్యా దోషాన్ని కూడా తుడిచివేస్తుంది.

సదాచారం (సత్ప్రవర్తన) వల్ల ఆయుర్దాయం, కీర్తి, శ్రేయస్సు వృద్ధి పొందుతాయి.

ప్రియంగా మాట్లాడే వారికి శత్రువులు ఉండరు.

కారణం లేకుండా ఇతరుల ఇంట్లోకి వెళ్ళకూడదు.

శివోహం

భగవంతుని తత్వం

భగవంతుని పై చూపే ప్రేమనే భక్తి అని అనుకోవచ్చు. భగవంతుడు లేనిప్రదేశం లేదు అంటారు. భగవంతుడు సర్వభూతములలో అంతర్భూతమై ఉంటాడు కనుక సర్వప్రాణులపైన ప్రేమ భావన కల్గి ఉండడం, సర్వపాణులపై సమదృష్టి కలిగి ఉండడమూ భగవంతునిపై ప్రేమ చూపించడమే. అంటే భగవంతునిపై భక్తిని కలిగి ఉండడమే. ఇటువంటి భక్తి ప్రతిమనిషిలో అంకురించాలి అంటే దేవాలయ సందర్శనాలు మార్గాలుగా ఉంటాయ. అక్కడ బోధించే ప్రతివిషయమూ మనిషిని మంచినడవడిలో నడిపించేట్టు చేస్తాయ.
కేవలం గుడికి వెళ్లడం దర్శనం ఛేసుకోవడమే భక్తి కాదు అక్కడ అర్చనాదులు నిర్వహించడవమే భక్తి అని అనలేము. భగవంతునిపై భక్తి అంటే భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతునికి మారురూపులుగా ఉండాలి.
దేవాలయాలు విద్యాకేంద్రాలు. అక్కడ చెప్పే పురాణ పురుషుల జీవితాలలోనో, లేక గీత బోధనో పెద్ద వారి అనుభవాలనో లేదా రామాయణ మహాభారత సన్నివేశాలో సంఘటనలనో ప్రవచనాలుగా వినిపిస్తుంటారు. వాటిని విన్నవారికి అవి జీవిత పాఠాలుగా పనికి వస్తాయ.
గుడికి వచ్చేవారికి ప్రసాదరూపంలో ఆహారం పెడుతుంటారు. ఆహారం రైతు పండించినా అది ప్రతిమనిషికి చేరేలోపు ఎందరి చేతుల్లోకి మారి వస్తుంటుంది. రైతును దేశానికి వెన్నుముకే కాదు భగవంతునికి ప్రతిరూపు కూడా.్భగవంతుడిచ్చిన గాలి, వెలుతురు, నీరు ఇలాంటి వాటిని ఉపయోగించి పండించిన పంటను తిరిగి దేవునికి సమర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకోమనే బోధ ఈ ప్రసాదరూపంలో అందుతుంది. అంతేకాదు ఉన్న ప్రసాదాన్ని నలుగురు కలసి పంచుకొని తినడంలోను ఐకమత్యం చూపించాలనే ప్రసాద వితరణలో కనిపిస్తుంది.
గుడిని పరిశ్రుభంగా ఉంచడంలో పరిసరాల శుభ్రత ఆరోగ్యాన్ని భద్రతనేర్ప రుస్తుంది అనేది కూడా ఈ దేవాలయాలు చెబుతుంటాయ.ఇన్ని విషయాలను బోధించే చైతన్యాలయాలు దేవాలయాలు కనుక అక్కడ కేవలం దేవుని దర్శనమే కాకుంఢా భగవంతుని తత్వాన్ని తెలుసుకొని జీవితాన్ని బాగుచేసుకోమని ప్రతివీధిలోను మన పూర్వులు ఓ దేవాలయాన్ని నిర్మించారు .
అందువల్లనే భారతీయులల్లోని ప్రతి ఇంట్లో వేకువ జామున వేసే ముగ్గు దగ్గర నుంచి చీమలకు పెట్టే నూక వరకు అన్నీ ఇతరులకు కాస్త సాయం చేయమని, ఉన్నదానిలోతృప్తిగా జీవించమనే సందేశం వినిపిస్తుంది

Saturday, April 1, 2023

శివోహం

మనిషి సర్వజ్ఞుడు కాదు తప్పు చేయడం సహజం...
ఎంత జ్ఞాని యైన తప్పు చేసేందుకు అవకాశం వుంది...
తప్పులన్ని తెలియక చేసేవే యెవరైన సత్యం చెప్పాలంటే దైవం దృష్ఠిలో అందరు క్షమార్హులే...
కనుక ఏ మనిషి క్షమా హృదయం కలిగి వున్నాడో, వారు ధన్యులు...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!తెరను తొలగించు ఆవల అగుపించు
తేరును నడిపించు తీరును ఎరిగించు
నీవుగ అనిపించు నేనును తెలిపించు
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!తెరను తొలగించు ఆవల అగుపించు
తేరును నడిపించు తీరును ఎరిగించు
నీవుగ అనిపించు నేనును తెలిపించు
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...