Thursday, April 6, 2023

శివోహం

శివ...
సర్వ రోగ భవ భయ హర్తవు నీవే...
సకల లోక పాలన కర్తవు నీవే...
పత్ర పుష్ప ఫల తోయ అర్పణతో నే తృప్తి
పొందు భోళా శంకరుడవు నీవే...
శరణంటే మరవక వచ్చి రక్షించే విభుడవు నీవే..

మహాదేవా శంభో శరణు.

Wednesday, April 5, 2023

శివోహం

పూజకు వేళాయేను ప్రార్థన మొదలయ్యేను
సూర్యోదయముతో మేధస్సే ఉత్తేజమయ్యేను 
పుష్పాలన్నీ వికసించేను ని కోసమే
సుమ గంధాలన్నీ వీచేను నీ కోసమే
మెరిసే సువర్ణాలన్నీ వెలిగేను నీ కోసమే
సువర్ణ కాంతుల వెన్నెల వేచేను నీ కోసమే .
ఇకనైనా నీ మొద్దు నిద్దురా విడరా
కైలాసం దిగిరరా పరమేశ్వరా
ఆస్తులు అంతస్తులు అడగను
బంగారం ,మణి మణిక్యాలు అడగను, 
సంపదలు నాకు వద్దు
నీ నామ స్మరణే చాలు
నీకు అభిషేకం చేయడానికి కన్నీటిని సిద్ధం సిద్ధం చేసి ఉంచాను
నా మొర ఆలకించి దిగిరరా పరమేశ్వరా!!!!

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నడవగలేని నీవు జగతిని నడిపిస్తున్నావు
ఓటమెరుగని నీవు భక్తికి ఓడుతున్నావు
చిత్రాలకే నీవు చిరునామా అయినావు
మహేశా.....శరణు.

శివోహం

అంతట నీవు న్నావని తెలుసు...
గమనిస్తూ ఉన్నావని తెలుసు...
 చేయిస్తూ ఉన్నావని తెలుసు...
అంతా నీ మయ మని తెలుసు...
నిన్ను తెలుసుకోలేని మందబుద్ది కలవాణ్ణి..
మహాదేవా శంభో శరణు.

Tuesday, April 4, 2023

శివోహం

మహేశా...
పాప వినాశ...
కైలాస వాసా...
ఈశా నిన్నే నమ్మి నాను దేవా...
నీల కంధర మహాదేవ అంటేనే చాలు కరుణించి బ్రోచే దేవర మట్టి లింగమున కొలువై ఉండి దీవించే మహానుభావా నీవే శరణు...

మహాదేవా శంభో శరణు.
  

శివోహం

శివా!తంతైపోయె ఈ సంసారం
తెలియనీయకుంది నీ జ్ఞానం
జ్ఞాన విరియనీ పయనం ముగియనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

శివుడంటే ఆలోచన...
శక్తంటే ఆచరణ...
ఈ రెండూ విడదీయరానివి...
ఆలోచన లేని ఆచరణ...
ఆచరణ లేని ఆలోచన లోకానికి అవసరం లేదు...
కనుక, ఈ రెండిటి సమన్వయధార, శ్రీవిద్యాస్వరూపంగా, యోగత్రయ శక్తిగా, శంకరులు సౌందర్యలహరిని సృష్టించారు.  శ్రీవిద్య ద్వారా, శ్రీచక్రోపాసన ద్వారా, కవితాగానం చేస్తూ అమృత భాషలో భగవత్పాదులు సాగించిన ఆనంద-సౌందర్యలహరిని.. గాఢంగా, తీవ్రంగా అధ్యయనం చేయాలి. శక్తి నుండి పుట్టిన పరాగ రేణువును బ్రహ్మ గ్రహించి లోకమును సృష్టిస్తున్నాడు.
ఒక్క శిరసుతో ఆ రేణువును మోయలేని విష్ణువు, పదివేల శిరసులున్న శేషుడై మోయగలుగుతున్నాడు. పరాగ రేణువును చూర్ణము చేసి, విభూదిని ధరించి శివుడు లయకార్యమును నిర్వహిస్తున్నాడు.
ఈ ముగ్గురూ తమ శక్తులను ఆమె పాదపద్మ పరాగ రేణువు నుండి గ్రహిస్తున్నారు. ‘సౌందర్యలహరి’ ఈ విధంగా సాగుతుంది. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క చక్రం, ఒక్కొక్క చక్రంలో బీజాక్షరాలున్నాయి. అదొక తీవ్ర విచారణ!

శంకర భగవత్పాదులు లలితా సహస్ర నామ స్తోత్రానికి భాష్యం రాయలేదు. ‘సౌందర్యలహరి’ని రచించి ఆ లోటును పూరించారు.
లలితా సహస్రనామ స్తోత్రానికి సౌందర్యలహరి, శ్లోకరూపంలో ఉన్న భాష్యమే! అనేక శాస్త్రాల రహస్యం తెలిసి, కవితామృతం రుచి ఎరిగి, మరిగి, అనల్పకల్పనా శక్తి కలిగి శ్రీవిద్యను ఉపాసించాలన్న తీవ్ర కాంక్షలున్నవారికి సౌందర్యలహరి, నిజానికి అసలు విద్య.
అది అనుగ్రహించేది అచ్చ తెలివినే. అనేక స్థాయుల్లో ఆకళింపు చేసుకోవాలి. వైకల్యం సాధించుకోవాలి. దేశ, కాలాతీతంగా భగవత్పాదులు మానవాళికి అనుగ్రహించిన సంవిద్‌ఫలం, సౌందర్యలహరి

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...