Monday, April 10, 2023

శివోహం

భక్త సులభుడవు...
దీన బంధుడవు...
కారుణ్య అమృత దయాంత రంగుడవు...
గౌరీ మనోహర
పురహర హర హర
మహాదేవ హర శంభో శంకర
పాహి పాహి పరమేశ్వర.

Sunday, April 9, 2023

శివోహం

భగవంతునికి భక్తునికి భేదం లేదు....
జీవాహంకారం ఉన్నంత వరకు జీవుడిలో భేదభావం కొనసాగుతూ ఉంటుంది...
ఆ జీవాహంకారమనే అడ్డు తొలగించుకుంటే భగవదైక్యమె.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!నిత్యం నీ పదములు కొలుస్తున్నా
మా కంటికి ఏనాడు కాననీయవు
ఏనాడూ నీ పదము నంటనీయవు
మహేశా . . . . . శరణు .

Saturday, April 8, 2023

శివోహం

శివా!నా గమ్యానికి నీవే గురుతు
ఆ గురుతుకి నీవే షరతు
నా గమనంలో నీవే మలుపు
మహేశా . . . . . శరణు .

శివోహం

నాలోనే ఉన్న నిన్ను బయట కూడ చూడ గలిగితే...
చేసే పనులన్నీ నీవే చేయిస్తూ ఉన్నా వనుకుంటే...
నీకూ నాకూ బేధముండదు...
ఎవరితో ఏ తగాదా ఉండదు...
నిను వెదకే పని లేదు కదా శివ.

మహాదేవా శంభో శరణు.

Friday, April 7, 2023

హరే గోవిందా

మంగపతి నిన్ను చూడ వచ్చినామురా
ముడుపులన్ని మూటగట్టి తెచ్చినామురా
                                           " మంగ"
పిల్లా పాపలతోటి కొండ ఎక్కుచూ
అలుపైనా సలుపైనా నీకు మొక్కుచూ
గోవిందాని నీ నామం స్మరణ చేయుచూ
చేరినాము నీ గుడికి వేంకటేశ్వరా
                                           "మంగ"
బారులు తీరిన జనము చూడ బారెడు
వరుసలలో వేచియుండ గుండె జారుడు
నా కనులారా నీ రూపం చూడనీయరు
నిముషమైన ఆ గడపను నిలువనీయరు
                                       "మంగ"
వెనుతిరిగి నిను చూడ వేంకటేశ్వరా
ములుగుతోంది నా మనసు ఏమి సేతురా
వెనుక వారు వెన్ను తట్టి నెట్టి వేయగా
వెడలినాను నీ రూపం నెమరువేయుచూ
                                        "మంగ"

భక్తి

మనం చేసినా మంచి పనులకు మనం కర్తలమని గర్వించడం కూడా  తప్పే...
భగవంతుని దయవలన ఆ పని చక్కగా జరిగింది  -లేకపోతే నేను చేయగలిగే వాడిని కాదు...
అని అనడంలో నిజమైన గొప్పదనం ఉంటుంది
అతడి  మనం ఒక పరికరాలం  మాత్రమే...
శివుని ఆజ్ఞలేనిదీ  చీమ అయినా కుట్టదు...
అలాగే మనం చేసే  కర్మలు అతని ప్రేరణ వలన జరుగుతాయి అంతే కాని...
నేను చేశాను నా వల్లే ఇది జరిగింది నేను గొప్పవాడిని ఇలాంటి భావాలు  అహంకారాన్ని అహం పెంచుతాయి ఫలితంగా భగవంతుని దయకు కరుణకు దూరం అవుతాం

ఓం నమః శివాయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...