Wednesday, May 17, 2023

శివోహం

శివ...
పెద్ద పెద్ద ఆశలు ఎమీ లేవు తండ్రి...
హృదయం ఉప్పొంగి నోరారా పిలుస్తా....
నా వైపు దయతో చూడు చాలు.
నువ్వే గురువు అని నమ్మి నమస్కరిస్తా ఆదుకొని చేయి అందించి కర్తవ్యం బోధించు....
ప్రేమ తో ఓ ఆలింగనము అర్ధిస్తా....
ఆత్మీయ కౌగిలి తన్మయత్వంలో తడిపి ఉంచూ...
లోక వ్యవహారాల తో విసిగి నీ భుజము పై తలవాల్చుతా...
ఒక్క చిరునవ్వుతో సమ్మోహన పరచు నువ్వు తప్ప అన్యం మరిచిపోయే తన్మయ వర్షం తో...
మహాదేవా శంభో శరణు.

Tuesday, May 16, 2023

శివోహం

వెతలు లేని ఆస్థానం
వెదుకుతున్న జీవునికి
తన నివాస సంస్థానం
ఎరుక అయ్యింది అదే...
నాది అయినది సాటి లేనిది
ఎనలేని వెలలేని ఆనంద నిలయమది
సాకార జీవితానికావలైనది 
ప్రాకృత బంధ విముక్తమైనది 
మనోబద్ద విలాస నిహతమైనది
క్రమేపీ వెలుగు పెంచు వికాస మార్గమది
అతి సూక్ష్మమై యొప్పు దివ్య క్షేత్రమది
అప్రమేయ ప్రేమతత్వమైన శివ హృదయమిది..

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, May 15, 2023

శివోహం

ఈశ్వరుడు సాక్షి . అంతా ఈశ్వరేచ్ఛ అని అంటూ ఉంటాం అంటే...
ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించిన వాడు ఈశ్వరుడు...
ఈశ్వరుడు నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది... అది "ఈశ్వరేచ్ఛ"., ఎవరు ఏ కర్మ చేస్తే వారికి ఆ ఫలితం వస్తుంది. ఆయన ఎవరి యందూ ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు ఆయన సాక్షి,
కాబట్టే ఈ కర్మలు నమోదై , ఆయా ఫలితాలు పొందుతున్నాం. ఈ కర్మకి ఇది ఫలితం వస్తుంది అని నిర్దేశించాడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!శబ్దాలను సృష్టించి నిశ్శబ్దంగా ఉన్నావు
నిశ్శబ్దంలో  శబ్దాన్ని తెలుసుకోమన్నావు
ఆ శబ్ధం తెలియగ  నిన్నే శరణమంటున్నా..
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
విషమును విషమని అందురు...
విషయము కూడా విషమట...
విషము విషయ వాసనయను...
విషయము ఎరిగించ రాదా గరళకంఠ...

మహాదేవా శంభో శరణు.

Sunday, May 14, 2023

శివోహం

భగవంతుదీని ఎంతలా ప్రార్ధించిన పలకడం లేదని అనకు...
నీవు చేసిన ప్రార్ధన త్రికరణశుద్దిగా ఉందో, లేదో గుర్తించు...
మనస్సు చలించేవారికి, మాటిమాటికి సందేహించేవారికి, కుతర్కం చేయువారికి ఏ మంత్రమూ ఫలించదు....
సాధకులకు శ్రద్ధ, విశ్వాసం ప్రధానం...
యాంత్రికంగా జపం చేయకూడదు...
యాంత్రికంగా చేస్తే మనకి , టేప్ రికార్డర్
కి తేడా ఉండదు కదా....
పరిపూర్ణ విశ్వాసంతో కదలని ప్రార్ధనలు పరమాత్మను చేరలేవు. స్పందన లేని సాధనలు ప్రతిస్పందన ఎలా దర్శిస్తాయి? ఆర్తి లేని భక్తి యొక్క ఆర్తనాదమును భగవంతుడు ఆలకించడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా ! ఆద మరచి నిదుర పోతే 
నిదుర లేపి నీవే ఉంటావు 
నిదుర ఆగి బెదిరి పోతే 
ఎదురు నిలిచి నీవై  ఉంటావు 
శివా ! నీ దయ

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...