Thursday, May 18, 2023

శివోహం

శివా!కన్నంటగ కానరావు
వెన్నంటగ వీడిపోవు
అభేదమేమొ తెలియరావు
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
అలనాడు కాలెత్తి నీ లింగం పై పెట్టినవాడిని భక్త కన్నప్ప అని దీవించినావు...
ఈనాడు నేను కాలు చేతులు జాపి సాష్టాంగ నమస్కారం చేశాను....
నాకేమి వరమిచ్చెదవయ్య పరమేశ్వరా...
శివ నీ దయ...
మహాదేవా శంభో శరణు.

Wednesday, May 17, 2023

శివోహం

కష్టాల్లో దేవుణ్ణి కొలుస్తూ, సుఖాల్లో మరుస్తూ, ఉన్నాడో లేడో అని అరకొర విశ్వాసంతో జీవనగమనం సాగిస్తే అంత్యకాలంలో స్ఫురణకు స్మరణకు అందడు ఆ అనంతుడు.
కన్నుమూసేవేళ ఆ కారుణ్యమూర్తే కళ్ళముందు కదలాడాలంటే, మనుగడలో మలుపులెన్ని ఉన్నా, మహాదేవుడిని మనసార విశ్వసిస్తూ, మన దైనందిక జీవితంలో ఆ దేవదేవున్ని ఓ ఆలంబనగా ఆరాధనీయునిగా చేసుకొని, సదా సన్మార్గంలో సాగిపోగలిగే సాధనను సాధిస్తే, సర్వవేళల్లో సర్వేశ్వరుడు స్పురిస్తాడు, అంత్యకాలంలో అంతరంగ ఆలయమున అనంతుడై అగుపిస్తాడు, అప్పుడు ఆ అంతర్యామిలోనే ఐక్యమౌతాం.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

ఆట కదరా శివ
ఆట కదరా కేశవ..

శివోహం

శివా!విషమ పరిస్థితి చూసి వణుకు పుట్టె
బ్రతుకు తీరు  తెలిసి భయము పుట్టె
ఉద్దరింతువన్న విశ్వాసం నా వీపు తట్టె
మహేశా . . . . . శరణు .

శివోహం

సర్వ జీవుల్లో ఉన్నది ఒకటే పరమాత్మ...
నీలో ఎదుటి వారిలో ఉన్న పరమాత్మ ను చూడగలిగితే...

వేరే ఏ దేవుడి చెంతకు వెల్లనవసరం లేదు.

ఓం నమః శివాయ

శివోహం

శివ...
పెద్ద పెద్ద ఆశలు ఎమీ లేవు తండ్రి...
హృదయం ఉప్పొంగి నోరారా పిలుస్తా....
నా వైపు దయతో చూడు చాలు.
నువ్వే గురువు అని నమ్మి నమస్కరిస్తా ఆదుకొని చేయి అందించి కర్తవ్యం బోధించు....
ప్రేమ తో ఓ ఆలింగనము అర్ధిస్తా....
ఆత్మీయ కౌగిలి తన్మయత్వంలో తడిపి ఉంచూ...
లోక వ్యవహారాల తో విసిగి నీ భుజము పై తలవాల్చుతా...
ఒక్క చిరునవ్వుతో సమ్మోహన పరచు నువ్వు తప్ప అన్యం మరిచిపోయే తన్మయ వర్షం తో...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...