Thursday, May 25, 2023

శివోహం

అమ్మా...నీ అనురాగం..
నా ఆరోగ్యం మరి ఆనందం
నాలో చైతన్యం మరి ఉత్సాహం
నీ అనురాగం...కేవల అనురాగం
మధుర తలపుల స్మ్రతి నీవే
నోటికందే భృతి నీవే
ఆధారానికి పట్టు తప్పని శృతి నీవే
సమస్యలను పరిష్కరించే ధృతి నీవే
కృతులన్నీ ముమ్మాటికీ నీవే..నీవే..
మాయా లోకపు బురదను వదిలించగా రావే
నా....హృదయములోనికి....
నా మెదడు గ్రహింపుకి...రావే...
ఇలలో వున్నంతవరకు నిండారగ
నా దృష్టికి స్పష్టత కావే
ఆనందరసాన..నీ పరిష్వంగాన
స్థితిధాత్రినై వెలగనీవే.....
కర్త,కర్మ,క్రియాకృతులు నీవైపోవే
జననీ...జననీ...దరహాసోజ్వలనీ...

శివోహం

కృష్ణ...
ఎటుల ఓర్తువు నీ రాధ  దీనతను 
ఎటుల కరుగదు నీ కటిన చిత్త మింక...
ఎటుల దయజూతువయ్య చెలిని నీ సఖి నీ...
కృష్ణ చిత్తరు వోలె మారిన ఆమె తీరు చూడు...
కృష్ణ తన శ్వాస నిట్టూర్పు సెగలు చూడు...
హరి శ్రీ హరి 

రాధే కృష్ణ రాధే రాధే.

Wednesday, May 24, 2023

శివోహం

నిరతము నిన్నే నమ్మితి నిఖిలలోకపూజ్యా
సతతము నామది సంతసముతో
ఆనందపారవశ్యముతో నీపదపద్మముల సన్నిధిన 
నిశ్చలమైనిల్చె
నీకై నేచేయుజపము,తపము ఫలింపజేయరా
నిన్నుతప్పఅన్యమెఱుగను
నీలకంఠేశ్వరా
జాగుచేయకరారా
కాలాతీతముచేయకురా
కాలేశ్వరా కాళేశ్వరా
నీ కనుచూపుతో కాంతినై లయమొందెద నీలో
కలకాలమూ నీతో నీలోనే నిల్చెద
కామేశ్వరా.
సదాశివార్పితం!

శివోహం

సత్యమనగా జగత్తును నాటకంగా ఆడించే పరమాత్మ...
అసత్యమనగా  జగత్తు పై జీవుడు పెంచుకున్న అనవసర మాయామోహం...
జీవుడు జగత్తు పై తాను పెంచుకొన్న మాయా మోహం లో తగుల్కొని విలపిస్తున్నంత సేపు మనస్సుకు శాంతి లభించదు...
జీవుడి లో సత్యమైన పరమాత్మ స్వరూపం ప్రకాశించినప్పుడే మనస్సుకు శాంతి విశ్రాంతి...
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!ఆది శక్తి నీ అర్ధ భాగమన
సర్వ శక్తులు నీ ఆధీనమని
అర్ధమయ్యిందిలే అర్ధనారీశ్వరా
మహేశా . . . . . శరణు .

శివోహం

తండ్రి వలె దయగల మహారాజు...
తండ్రి చిటికెడు విభూది కి కరుణిస్తే...
పిడికెడు అటుకులు బెల్లం నీకు చాలు...
హరిహరపుత్ర మహాదేవా శంభో శరణు...

శివోహం

శివ...
మదిలో కలవరం కనిపించే లోకం పోకడకు
యదలో అలజడి కదిలే కాలం తీరుకు కాదేమో...
నీ ఆటలో పావును కదా...
బంధాల బందీకానలో నను బందించి ఆశల పాశాలలో శోదించి మనుసును మరీ రాటుదేలుస్తున్నావు...
మహాదేవా మరో అధ్యాయానికి తెర తీస్తున్నావా...
ఏ తీరం చేర్చినా భారం భరోసా నీదే తండ్రి...
మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...