Friday, June 9, 2023

శివోహం

ఈ శరీరం ఒక రథం...
మన ఇంద్రియాలే గుర్రాలు
ఆ గుర్రాల  కళ్ళాలు మనసు...
మనసు సారధి...
బుద్ది రథికుడు ఐ రథాన్ని నడిపిస్తూ ఉంటాడు...
గుర్రాలు అనే ఇంద్రియాలు మనసు అనబడే కళ్లెం చేత  లాగబడుతూ  నియంత్రణ లో ఉంటే రథం తన గమ్యం అయిన ఆత్మ సన్నిధానం వేపు చక్కగా వెళ్తూ ఉంటుంది...
కోరికలు ఉంటే , మనసు బహిర్ముఖం అవుతుంది...
కోరికలు అణగి పోతే ,అంటే ఇంద్రియాలు నియంత్రించ బడితే మనసు అంతర్ముఖం అవుతుంది.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

హనుమంతునకు శ్రీరామ నామము నిత్యఔషధం...
నారదునకు  నారాయణ నామము నిత్యఔషధం...
ఈ మోహనుడిని నీ నామమే నిత్యఔషధం...
మహాదేవా శంభో శరణు.

Thursday, June 8, 2023

శివోహం

శివా!కైలాస పర్వతం మంచుకొండో,
మట్టికొండో ఏదైననేమి...
అదే మాకు కొండంత అండ.
మహేశా . . . . . శరణు

Wednesday, June 7, 2023

శివోహం

ఏ లాభం మించన లాభం లేదో...
ఏ సుఖాన్ని  మించన సుఖం లేదో...
ఏ జ్ఞా నానికి మించన జ్ఞానం లేదో...
ఆ పరమాత్మవు నీవె తండ్రి...
మహాదేవా శంభో శరణు.

శివోహం

ఆధ్యాత్మికత అంటే -
ఆది నుండి ఉన్న ఆత్మ కథ...
నిత్యమూ ఆత్మను అధ్యాయనం చేయడం...
శరీరం, ప్రాణం, మనస్సే కాకుండా ఆత్మ అనే సద్వస్తువు ఉంది అనే జ్ఞానపు ఎఱుక...
నేను అంటే ఏదో నాకు తెలిపే యోగం...
ఎఱుక కోల్పోకుండా దైవ స్ఫురణలో ఉండడం
బహిర్ముఖమైన మనస్సును అంతర్ముఖం చేయడం...
ఓం శివోహం... సర్వం శివమయం.

shivoham

శివా!నిదురంటే కలగనే వరమని 
ఆ కలనైనా నిను కనవచ్చునని
కలలలో నిను చూసాకే తెలిసింది
మహేశా . . . . . శరణు .

శివోహం

గౌరీ దేవి శక్తి స్వరూపము అయితే...
శివుడు చైతన్యం...
శక్తి ఉంటే చైతన్యం ఉంటుంది,ప్రాణం ఉంటే శక్తి అంటే శివం ,లేకుంటే శవం...
అందుకే శక్తి స్వరూపిణి  దేవి కృప కోసం ,ఆమె ప్రసాదంగా అనుగ్రహించే  భిక్ష కోసం , ఆమె వద్దకు భిక్షాం దేహి అంటూ అర్థించాడు శివుడు ,
అన్నపూర్ణా దేవి ఇచ్చే భిక్ష వలన శివునికి శక్తి వస్తుంది ,దానితో చైతన్యం ,దానితో భక్తి జ్ఞాన వైరాగ్యం కలుగుతాయి...
ఆహారం  భిక్ష గా గ్రహించడం వల్ల పొందే   ప్రాణ శక్తి తో మానవుడు అద్భుతాలు సృష్టిస్తూ దైవానికి చేరువ అవుతున్నాడు
ఇదంతా భిక్ష మహిమా
ఇచ్చేవాడు ,శివార్పణం అని భావిస్తూ  భిక్షను ఇస్తే,
గ్రహించే వాడు  పరాత్పరుని ప్రసాదంగా  స్వీకరిస్తూ ఉంటే ,ఆ పరమాత్మ ఆ ఇరువురికీ తన కృప ను అందజేస్తూ ఉంటాడు , అనగా దాత గ్రహీత ఇద్దరూ శివ స్వరూపాలే.
ఓం శివోహం... సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...