Friday, June 16, 2023

శివోహం

శివా! కాయాన్ని కట్టబెట్టావు
జ్ఞానాన్ని దాచిపెట్టావు
యాచిస్తున్నా జ్ఞాన భిక్షపెట్టు
మహేశా ..... శరణు.

Thursday, June 15, 2023

అమ్మ

ఆ పరబ్రహ్మస్వరూపిణి అయిన అమ్మవారు పంచమహాభూతములతో కలసి, పంచభూతాత్మకమైన శరీరములు అనగా సకల జీవులయందు తానుంటూ, జననము, వృద్ధి, క్షయము అనెడి సంసారమును ఏర్పరచి, చక్రముత్రిప్పినట్లు త్రిప్పుచున్నది యని మనుస్మృతియందు గలదు. గనుకనే *భవచక్రప్రవర్తినీ* యని అనబడినది.
అమ్మ దయ అంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీ మాత్రే నమః.

శివోహం

శివా!ఈ అడ్డుకళ్ళే మోక్షానికి అడ్డు
నిలువు కన్ను తెరచుకొనగ గడ్డు
అడ్డు తొలగనీ గడ్డు ముగియనీ
మహేశా . . . . . శరణు .

Wednesday, June 14, 2023

శివోహం

శివ...
నిన్నొక్క సారి చూడాలని ఉందయ్య...
నా గుండె లోని బాధ నీకు చెప్పాలని ఉంది !
ఎక్కడవుంటావు నీవు ?...
ఎలా నిన్ను తెలిసేది ?...
పట్టరాని నిన్ను ఎలా పట్టాలి...
భక్తితో డ నీ  కృపను  పొందాలని ఉంది తండ్రి...
నాలో నిను దర్శిస్తూ ఆనందించాలని ఉంది...
నీ కరుణామృత వర్షధారలో నే ఎలా తడిచి తరించేది?...
నీ చరణకమలాల ముందు నా హృదయాన్ని  ఎలా పరచేది...
మహాదేవా శంభో శరణు.

శివోహం

నీ సేవయే తప్పా...
అన్య ధ్యాస లేని తెలియని...
నేను మూగ జీవినే తండ్రి...
ఈ పశువుని ఆదరించి...
నీ మంద లో కలుపుకో...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!సంగతులంటూ నీకేమి చెప్పేది
వింతలన్నీ నీతోనే కూడి వుంటే
నేను కూడా ఆ వింతల్లో ఒకటై
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!సంగతులంటూ నీకేమి చెప్పేది
వింతలన్నీ నీతోనే కూడి వుంటే
నేను కూడా ఆ వింతల్లో ఒకటై
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...