Friday, June 23, 2023

శివోహం

శివా!శత్రు సంహారాన నెగ్గు పినాకము
వామ హస్తమున దాల్చి విహరించు నీవు
నాలోని శత్రువులనణచగా రమ్ము .
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!"నేను"కానిది కాలి బూడిద అయింది
ఆ బూడిద నీ అభిషేకానికి  సిద్ధమయ్యింది
సిద్ధించనీవయ్యా సకల సిద్ధి ప్రదాతా
మహేశా . . . . . శరణు .

శివోహం

పునరపి జననం...
పునరపి మరణం...
దీనికి తరుణోపాయం శివోహం అంటూ చిత్తశుద్ది తో శివ భజన చేస్తూ ఉండడమే...
అన్యదా శరణం నాస్తి...
త్వమేవ శరణం మమ...
తస్మాత్ కారుణ్య భావేన...
రక్ష రక్ష పరమేశ్వర అంటూ  దేవదేవుడు మహాదేవుని శరణాగతి చేయడమే...
ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, June 22, 2023

శివోహం

నీలి కొండ చేరినాము మాధవా
                  నిన్ను చూసి మురిసినాము మాధవా
చెంత చేరి నిలిచినాము మాధవా
          మా చింతలన్ని మరచినాము మాధవా 
మాధవా నీలి మాధవా.

ఎన్నాళ్ళగ విన్నాము ఇన్నాళ్ళకు కన్నాము
ఎంత గొప్ప వాడివయా మాధవా
దివ్యమైన నీ రూపం చూడలేని మాకళ్ళు
చీకటింటి లోగిళ్ళు మాధవా.     
జన్మ జన్మ పాపాలు జగతిలోన శోకాలు
తొలగునులే నిన్ను చూడ మాధవా
మాధవా నీలి మాధవా...

చిత్రమంత విన్నాము చిత్తరువులు కన్నాము
కర చరణము కానలేదు మాధవా
దారుశిల్పమన్నారు ధరణి చిత్రమన్నారు
దాగివుంది నీ తేజం మాధవా
భోగపురి ఈ పురి భోజింపగ నీకు సరి
భజియింతుము మరి నిన్నే మాధవా
మాధవా నీలిమాధవా

నీలి చక్రమున్నది నింగినంటు చున్నది
నీ తేజమునే చాటుతోంది మాధవా
నీ పతాకపు రెపరెపలు గాలికెదురు తిరిగేను
నీ చిత్రమైన లీల యిది మాధవా
తీరు తెలుసుకున్నాను పేరు తలచుకున్నాను
నిన్ను కొలుచు భాగ్యమీయి మాధవా
మాధవా నీలిమాధవా

శివోహం

శివ...
నా మనసు చేసిన పుణ్యమే కదా మనసున నిను నిలుపుట...
కరములు చేసిన పుణ్యమే కరుణాంతరంగా నిను కొలవడం...
దేహము చేసిన పుణ్యమే దేవాధిదేవునికి దాసానుదాసుడనవుటం...
పెదవులు చేసిన పుణ్యమేనీ నామ స్మరణ చేయడం...
హ్రుది చేసిన పుణ్యమే శివ శివ సదా జపించటం...
కనులు చేసిన పుణ్యమే పార్వతి పరమేశ్వరుని కనులార తిలకించటం...

మహాదేవా శంభో శరణు...

కన్నయ్య

కృష్ణా....
నా ప్రేమ బంధం ప్రణయ బాంధవ్యమై నీ బాహుబంధాలలో పరవశిస్తూ బందీ కమ్మంటుంటే బరువైన నా గుండె నీకు ఎన్నో ఊసులు చెప్పమంటోంది కృష్ణా...
నా మది నీ ముందు పరచమంటోంది...
నన్ను నీలో విలీనమవమంటోంది...
నన్ను నీకే అర్పించమంటోంది...
నా మౌనం వెనుక ప్రేమను..
నా హృదయం మాటున దాగిన నా ప్రేమ ఘోషను నీలో దాచుకోమంటోంది...
నీ హృదయాన్ని నాకు అర్పణ చేస్తావో...
నీవే నా చెంత చేరి నా శ్వాసకు ఊపిరి పోస్తావో నీ దయ కన్నయ్యా...

నా తండ్రి మణికంఠ

దేహం పాపం చేయదు...
పాపం చేసేది మన ఆలోచనలు...
గంగమ్మ దేహాన్ని మాత్రమే శుద్ధి చేస్తుంది...
మన అలోచనలను కాదు...
అంతరశుద్ది చేసుకోవాక్సింది మనకు మనమే...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...