Saturday, June 24, 2023

శివోహం

శివా!ప్రతి ఆశ్రమము నాకు పెద్ద బాలశిక్ష,
ప్రతి శ్వాసలో నిలిచేను నీదైన రక్ష
ఈ పలుకులన్నీ నీవొసగిన జ్ఞాన భిక్ష.
మహేశా . . . . . శరణు .

శివోహం

భగవంతుణ్ణి తలవని రోజు దుర్దినం...
తలిచిన రోజు సుదినం...
దైవాన్ని తలచుకోవాలంటే నమ్మకం మొదటి మెట్టు ఎంత విశ్వాసమో అంత ఫలితం...
అందుచేత మన కష్టసుఖాలకి ,భగవంతుణ్ణి పూజించడానికి లంకె పెట్టగూడదు....
లోన ఉన్న అంతర్యామికి , బయట మనం అనుభవించే భౌతిక కర్మలఫలితాలకు ఏ మాత్రం సంబంధం లేదు..
మన సంచిత కర్మల ఫలితం మన ఈ కష్టాలు సుఖాలు...
అంతే గాని దైవం మూలకారణం కాదు కదా...
చూసే చూపులో, భావించే మనసులో దైవాన్ని ఆరాధించే తత్వం దాగి ఉంటుంది...
తపన, సాధన,,సత్సంగం, దైవానుగ్రహం తోడైతే తప్ప హృదయంలో దైవాన్ని స్థిరంగా ఉంచుకోడం సాధ్యం కాదు కదా...

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, June 23, 2023

శివోహం

శివా!శత్రు సంహారాన నెగ్గు పినాకము
వామ హస్తమున దాల్చి విహరించు నీవు
నాలోని శత్రువులనణచగా రమ్ము .
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!"నేను"కానిది కాలి బూడిద అయింది
ఆ బూడిద నీ అభిషేకానికి  సిద్ధమయ్యింది
సిద్ధించనీవయ్యా సకల సిద్ధి ప్రదాతా
మహేశా . . . . . శరణు .

శివోహం

పునరపి జననం...
పునరపి మరణం...
దీనికి తరుణోపాయం శివోహం అంటూ చిత్తశుద్ది తో శివ భజన చేస్తూ ఉండడమే...
అన్యదా శరణం నాస్తి...
త్వమేవ శరణం మమ...
తస్మాత్ కారుణ్య భావేన...
రక్ష రక్ష పరమేశ్వర అంటూ  దేవదేవుడు మహాదేవుని శరణాగతి చేయడమే...
ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, June 22, 2023

శివోహం

నీలి కొండ చేరినాము మాధవా
                  నిన్ను చూసి మురిసినాము మాధవా
చెంత చేరి నిలిచినాము మాధవా
          మా చింతలన్ని మరచినాము మాధవా 
మాధవా నీలి మాధవా.

ఎన్నాళ్ళగ విన్నాము ఇన్నాళ్ళకు కన్నాము
ఎంత గొప్ప వాడివయా మాధవా
దివ్యమైన నీ రూపం చూడలేని మాకళ్ళు
చీకటింటి లోగిళ్ళు మాధవా.     
జన్మ జన్మ పాపాలు జగతిలోన శోకాలు
తొలగునులే నిన్ను చూడ మాధవా
మాధవా నీలి మాధవా...

చిత్రమంత విన్నాము చిత్తరువులు కన్నాము
కర చరణము కానలేదు మాధవా
దారుశిల్పమన్నారు ధరణి చిత్రమన్నారు
దాగివుంది నీ తేజం మాధవా
భోగపురి ఈ పురి భోజింపగ నీకు సరి
భజియింతుము మరి నిన్నే మాధవా
మాధవా నీలిమాధవా

నీలి చక్రమున్నది నింగినంటు చున్నది
నీ తేజమునే చాటుతోంది మాధవా
నీ పతాకపు రెపరెపలు గాలికెదురు తిరిగేను
నీ చిత్రమైన లీల యిది మాధవా
తీరు తెలుసుకున్నాను పేరు తలచుకున్నాను
నిన్ను కొలుచు భాగ్యమీయి మాధవా
మాధవా నీలిమాధవా

శివోహం

శివ...
నా మనసు చేసిన పుణ్యమే కదా మనసున నిను నిలుపుట...
కరములు చేసిన పుణ్యమే కరుణాంతరంగా నిను కొలవడం...
దేహము చేసిన పుణ్యమే దేవాధిదేవునికి దాసానుదాసుడనవుటం...
పెదవులు చేసిన పుణ్యమేనీ నామ స్మరణ చేయడం...
హ్రుది చేసిన పుణ్యమే శివ శివ సదా జపించటం...
కనులు చేసిన పుణ్యమే పార్వతి పరమేశ్వరుని కనులార తిలకించటం...

మహాదేవా శంభో శరణు...

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...