Friday, June 30, 2023

శ్రీ కృష్ణ గోవిందా

నీలమేఘ శ్యాముడు
నీరజ దళ నేత్రుడు
సామజవర గమనుడు
సరసిజ దళ నేత్రుడు
సామ గాన లోలుడు
భక్తజన మం దారుడు 
జగదేక సుందరుడు 
షోడోశ కళా పరిపూర్ణుడు 
శంఖచక్ర పీతాంబరుడ
శిఖిపించ మౌళి
హరి శ్రీహరి శరణు.

శివోహం

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపుడు
కలియుగ ప్రత్యక్ష దైవం
ఆపదమొక్కులవాడు అనాధ రక్షకుడు
విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు
అంతటా తానుకాక మరొకరు ఎలా
కనిపిస్తారు...

ఏడుకొండలవాడా వేంకటరమణా గోవిందా
ఓం నమో నారాయణాయ

శివోహం

శివా!సగం సగం అంటావు
ఆ సగమూ నీవే అంటావు
అలా ఎలా అంటావు
మహేశా . . . . . శరణు .

శివోహం

మంచి చెడ్డలు మనిషికి చెందినవి కావు
మనసుకు చెందినవి
వాల్మీకి, భక్తకన్నప్ప మొదలగు వారు చెడునుండి
మంచిగా మారినవారు
మారినవారు మరల మారలేదు
కానీ, 
నేను నా అవసరాలకు మంచి చెడుల నడుమ నలిగిపోతున్నా!!
ఏదారిలో నడుపుతావో? నీదయ శివా...
మహాదేవా శంభో శరణు.

Thursday, June 29, 2023

శ్రీమాత్రే నమః

ఈ సృష్టికి మూలమైన శక్తి ఒకటి ఉంది. ఆ శక్తే వివిధ సందర్భాల్లో వివిధ రూపాలను ధరించి శత్రు నాశనం చేసి ఆస్తిక లోకాన్ని కాపాడుతూ వస్తుంది. ఆమె పార్వతి, ఉమ, ఇంద్రాణి, పరాశక్తి, ప్రత్యంగిదేవి. అన్ని రూపాలూ ఆమెవే. ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది. అందుకే ఆమె ఆది పరాశక్తి అయింది.

అమ్మ పిలిస్తే పలుకుతుందీ అంటే, అయ్య పిలిస్తే పలకడని కాదు. అయ్య ప్రత్యేకత వేరు. అమ్మ ప్రత్యేకత వేరు. అమ్మ అందరికీ అమ్మే. అసలు అమ్మ అనే పదమే ప్రేమ స్వరూపం. అందువల్ల అమ్మ ఆ ప్రేమ స్వరూపి, ఆనంద స్వరూపి, కరుణా స్వరూపి దయామయి. అందువల్ల అమ్మ నామ స్మరణ ప్రేమమయమే. అందుకే సాయిబాబా ప్రేమ గరించి విశిష్టంగా చెప్పేవారు. తోటివారిని ప్రేమించమని చెప్పడంలో రహస్యం ఇదే. అందుకే ఆయన రాబోయే కాలంలో ప్రేమ సాయిగా వస్తానని చెప్పారు కూడా. మనస్సు శాంతిగా ఉండాలన్నా, బుద్ధి కావాలన్నా, యశస్సు, తేజస్సు, ఐశ్వర్యం, ధైర్యం, కార్యసిద్ధి, బలం, ఆయురారోగ్యాలు-ఇలా ఏది కావాలన్నా అన్నిటికీ ఆది మూలం ఆ తల్లి. అహంకారం, ఈసుఅసూయలు, కష్టాలు, నష్టాలు,కోపాలు, తాపాలు, రోగాలు, రొష్టులు, అప్పులు ఇవన్నీ తొలగిపోవాలంటే ఆ అమ్మ దయ ఉండాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రుతి, స్మృతి, ఇతిహాస, పురాణ సదాచారాలనే ఐదింటిలో ఒకటైన ధర్మ స్వరూపంగా అమ్మ చిదాకాశ స్వరూపిణిగా వెలుగొందుతోంది.

శివోహం

శివా!అడుగు అడుగునా నినుగంటున్నా
అద్వైత మెరుగగ పయనిస్తున్నా
ద్వైతం దగ్ధమవనీ అద్వైతం అలవడనీ
మహేశా . . . . . శరణు

శివోహం

శివ...
నా కర్మకు సంపూర్ణ బాధ్యత నాదే...
అందుకే కష్టాలను ఇష్టంగా ని ఆశీస్సులుగా ప్రసాదంగా భావిస్తు ఎన్ని కష్టాలనైనా ఇష్టంగా నీ ప్రసాదంగా నిన్ను స్మరించి సేవించి తరించే శుభ తరుణంగా కర్మ ఫలితం అనుభవించే మహద్భాగ్యం గా ఆ బాధలను సంతోషంగా స్వీకరిస్తాను...
కానీ ఒకటే కోరిక తండ్రి నీ సన్నిధిలో ఉంటూ నిరంతరం కొనసాగే భక్తి భావ సంపదను ఎన్ని జన్మల కైనా సరిపోయే భక్తి జ్ఞాన వైరాగ్య భావ సంపదను మాత్రం అనుగ్రహించు...
మహాదేవా శంభో శరణు.

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.