Sunday, July 2, 2023

శివోహం

శివ...
నీ నామ స్మరణలో ఏదో అద్భుతం దాగివుందయ్యా బాధ వచ్చిన, కష్టం వచ్చిన మనసారా తండ్రి శంకరా అని నిను పిలిస్తే చాలు, కరుణించి వెనువెంటనే కాపాడతావు...
ఎటువంటి సమస్యకైనా, నీ నామ స్మరణేనయ్యా నాకు దివ్య మంగళ ఔషదం. 
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా! గుర్తించలేనని గురువుగా వచ్చి
గురి కుదరగా నాకు బోధ చేసావు
మతిలోన నువు చేరి గతిని తెలిపావు
మహేశా . . . . . శరణు.

Saturday, July 1, 2023

జై శ్రీరామ్

పరమపావనం 
రామనామం
రామ అను రెండక్షరములు మనోహరమైనవి. మధురమైనవి....
అమృత సమానం...
ఈ రెండు అక్షరములు ముక్తి అను అమృతమును ఇచ్చును....
సులభమైన ఈ నామం ఇహమందు సుఖమును, సంపదలను ఇస్తే, పరమునందు విష్ణుసాయుజ్యం ఇస్తుంది. లౌకికముగా భవభూతి, పారమార్ధికముగా ఆత్మానుభూతి రామనామం వలన కల్గుతుంది.

జై శ్రీరామ్ జై జై హనుమాన్.
జై శ్రీమన్నారాయణ

అయ్యప్ప నా తండ్రి

నీ మదిలో నిరంతరం దైవ నామాన్ని నిలుపుకో...
నామమే కలియుగంలో రక్ష...
అదొక్కటి బలంగా నీ మనస్సులో నాటుకుని నిరంతరం స్మరిస్తుంటే చాలు...
నీ జీవన నౌక ఆయనే నడుపుతాడు కడవరకు.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం...సర్వం శివమయం.

శివా!కాలగర్భంలో కలిసాక నన్నుకాలానికి మరల అందనీయకుఅంతులేని వ్యధలపాలు కానీయకుమహేశా . . . . . శరణు .

శ్రీ కృష్ణ గోవిందా

నీలమేఘ శ్యాముడు
నీరజ దళ నేత్రుడు
సామజవర గమనుడు
సరసిజ దళ నేత్రుడు
సామ గాన లోలుడు
భక్తజన మం దారుడు 
జగదేక సుందరుడు 
షోడోశ కళా పరిపూర్ణుడు 
శంఖచక్ర పీతాంబరుడ
శిఖిపించ మౌళి
హరి శ్రీహరి శరణు.

శివోహం

శివ
నశించే దేహానికి ఫై పూతలెందుకో కదా 
ఒకనాడు అంతమయ్యే కట్టే కోసం ఇంత ఆరాటమెందుకు...
తనను తాను తెలుసుకోలేని మానవజన్మ ఎందుకు...
కుళ్లు కుచ్ఛితాలు ఒంటి నిండా నింపుకొని మానవుడు సాధించేదేమిటి...
సుఖధుఃఖములు జనన మరణములు తప్పించే నిన్ను తెలుసుకోలేడేందుకో...
మహాదేవా శంభో శరణు

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...