Wednesday, July 5, 2023

శివోహం

తప్పులు చేస్తూ ఉంటాం నిత్యం అందరం అది మానవ నైజం కానీ వాటిని ఒప్పుకుంటూ, "శివ" కరుణించి క్షమించు అని దైవం ముందు నిలబడి మొక్కడం మానవత్వం. 

ఓం నమః శివాయ

శివోహం

ఆశగా వున్నాది శివా నిన్ను ఒకసారి చూడాలని
నీ సన్నిధిని చేరి కనులార నినుచూసి ఈ జన్మ తరియించి పోవాలని...

కనులెదుట కాలమే పరుగు తీస్తున్నాది తనువులో కండలే కరిగి పోతున్నాయి ఏ జన్మ శాపమో ఏమి గ్రహచారమో బంధాలనే వీడి కదలలేకున్నాను

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!సగమైన చంద్రుడు సిగలోన మెరిసె
జడలోని గంగమ్మ గూడుగా తలచె
సుతుడైన నేను సాయుజ్యమే తలచె
మహేశా . . . . . శరణు .

శివోహం

మనం జీవితంలో ఉన్న వాటి గురించి కాకుండా, మనకులేని వాటి గురిం చే ఎక్కువగా ఆలోచిస్తూ ఆరాట పడుతూ వాటిని పొందడం కోసం  తరుచుగా బాధపడుతూ ఉంటాం...
అవి పొందడం వలన మనం  తృప్తిగా ఉండగలమా ఆ పొందిన వాటిని దూరం  చేసుకోకుండా  చూడగలమా లేక పొందిన వాటితో,మనం  నిరంతరం ఆనందంగా ఉండగలమా ఇది ప్రతీ మనిషికి ఎప్పుడూ ఎదురయ్యే  ప్రధానమైన సమస్య...
ధనం  ఈ రోజు ఉంది,ఉంటుంది అది రేపు  పోతుంది...
ఆరోగ్యం ఉంది ఇపుడు అది మారుతూ పోతూ ఉంటుంది...
స్నేహితులు, ఆత్మీయులు బంధువులు కూడా దూరం అవుతూ ఉంటారు ఎవ్వరూ మిగలరు, చివరకు నేను, నాది అనే ది కూడా పోతాయి...
అనుక్షణం కాలంతో బాటూ మార్పుకు గురి అయ్యే దానికి మనం ఆపలేం...
ఉన్నవన్నీ పోయేందుకే ఉన్నాయి...
మరి ఈ ఆరాటం ఎందుకు మిత్రమా.
ఓం నమః శివాయ.

Tuesday, July 4, 2023

శివోహం

శంభో...

నీ జటాఝూటం నుండి ఉరుకుతున్న గంగమ్మ...
నిను విడవలేక విచారంగా వుందేమో .
అందుకేనే శివ నా కనుల కొలను నుండి కన్నీటి రూపంగా నిను స్మరిస్తూ బయటకు వస్తోంది...

మహాదేవా శంభో శరణు.

శివోహం

నీ ముందు ఉన్నది ప్రపంచం...
నీ వెనుక ఉన్నది దైవం...

ఓం నమః శివాయ.

శివోహం

పరమేశ్వరుడిని నిరంతరం ఆరాధన చేసే వారి హృదయమే కైలాసం...

ఓం నమః శివాయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...