Saturday, July 8, 2023

శ్రీరామా

ఈ ప్రపంచం లో ఒకరినొకరు ప్రేమించు కోకుండా ఎవరూ కనిపించరు...
ఏదో ఒకదానిని ఎవరో ఒకరిని మరొకరు విధిగా  ప్రేమిస్తూ ఉంటారు...
కానీ భక్తుడైనటువంటి వాడు మాత్రం కేవలం భగవంతుణ్ణి మాత్రమే ప్రేమిస్తాడు...

జై శ్రీరామ్ జై జై హనుమాన్.

శివోహం

దేవాది దేవా..
మహాదేవ...
ఈ దీనునిపై నీవు చూపిస్తున్న ఈ కరుణామృత వర్షమున కు శతకోటి ప్రణామాలు తండ్రి...
ఒకే ఒక కోరిక శివ నీ పాద పద్మాలను తరుచూ సేవించుకుని తరించే మధుర అనుభూతులను నాకు ప్రసాదించు...
ఇంతకన్నా ఆనందము ఇలోకం లో మరొకటి ఉంటుందా కైలాస నాథా...

మహాదేవా శంభో శరణు.

Friday, July 7, 2023

శివోహం

శివా!కనులు మూస్తే ఎదుటనుంటావు
కనులు తెరిస్తే మనసులో వుంటావు
మనసు మాయనీ,నిన్ను తెలియనీ
మహేశా ..... శరణు.

శివోహం

శివ...
సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ
నిన్ను మరిచిపోతున్నాం...
అహంకార మమకారాలు అనే ఇనుప గొలుసులతో కృత్రిమ అనందం అనే ముసుగులో అజ్ఞానంతో మాకు మేమే బందీలమై నీ గురించిన ధ్యాస లేకుండా నిన్నువిడచి  మరచి  బ్రతుకుతున్నా నన్ను క్షమించు...
మహాదేవా శంభో శరణు.

శివోహం

ఎన్ని కష్టాలు రానీ సుఖాలు పోనీ నిన్ను తలిచే, కొలిచే పూజించే, భజించే భావించే అచంచలమైన భక్తివిశ్వాసాలను అనుగ్రహించు...
భావ దారిద్ర్యం రానీకు పరమాత్మా...
నీ స్మరణయే సుఖం నీ తలంపు లేని ఘడియలు కష్టం, కావున స్వామీ మంగళకరము, మహిమాన్వితమైన నీ దివ్యవిగ్రహ దర్శన మహాభాగ్యాన్ని ప్రసాదించు...
శరణు జగదీశా శరణు...
ఆదిదేవా శరణు...
మా కున్న కష్టాలలో కూడా నీ ఉనికిని గుర్తించే స్పూర్తిని శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించు...
మహాదేవా శంభో శరణు.

హరే కృష్ణ

లీలమానుష విగ్రహుడు శ్రీకృష్ణ భగవానుడు...
అన్ని వికారాలు తొలగించి తనయందలి భక్తికి యోగ్యత అందిస్తాడు...
తాను మ్రోగించిన మురళి మన శరీరమే...
దానికి, ఉన్న రంధ్రాలు మన శరీరానికి గల రంద్రాలే...
కన్నయ్యను తలచుకుంటూ చేసే పనులు కృష్ణునికి దగ్గరకు చేరుస్తాయి...
మనం పలికే స్వరంలో కృష్ణ నామం కృష్ణభక్తి కృష్ణప్రేమ మాధుర్యం హృదయంలో పొంగిపోవాలి.

హరే కృష్ణ

Thursday, July 6, 2023

శివోహం

నీ పాదాలు శరణం...
నీ తలపే మధురం...
నీ స్మరణయే జీవనంగా బ్రతికే భావ సంపద.ను కరుణించు చాలు
ధన్యోస్మి వేణు మణికంఠ...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...