Wednesday, August 2, 2023

శివోహం

నన్ను నేనే మరచి...
నీధ్యానంలో మునిగితే...
పిచ్చివాడినంటున్నది లోకం...
నిన్నే తలచి నిన్ను చెరుటకై...
నీ వెంటపడుతుంటే...
వెర్రివాడంటోంది లోకం...
నిజమే నేను వెర్రి వాడిని నిలగా తిక్కవాడిని...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!జ్ఞానం పూవులాగ వికసించనీ
వైరాగ్యం వెయ్యేళ్ళు వర్ధిల్లనీ
హృదయాన విష్ణువుతో జతకట్టనీ
మహేశా . . . . . శరణు.

Tuesday, August 1, 2023

శివోహం

నాన్నా
ఎన్ని జన్మలైందో 
కనులారా నిను చూసి
తనివితీరా ఆలింగనించుకొని
ఆర్తితో ఆరాధించి
కన్నీటితో పదములు కడిగి

అంతులేని ఆవేదనా తరంగాలలో
మునిగిపోతున్న నన్ను నీ ఒడికి చేర్చు
ఓపలేని కష్టాల వరదలో
 కొట్టుపోతున్న నన్ను అక్కున చేర్చు
తొలగించుకోలేని మయ పొరలలో
సంచరిస్తున్న నన్ను దయతో అదరించు
విడిపించుకోలేని బాంధాల వలలలో
చిక్కుకున్న నన్ను వాత్సల్యాన స్వీకరించు

ఒకపరి రావయ్యా
ఈ కింకరుని అనుగ్రహించవయ్యా

శివయ్యా నీవే దిక్కయ్యా

శివోహం

నేను .నా అహం శిఖరాల పై  నిలుచున్నప్పుడు 
నీ త్రిశూలం కొనకు పని చెప్తావు 
నా తేలిపోయే కీర్తి ప్రతిష్టల మాటున 
నిను మరిచినప్పుడు నీ ఢమరుకం మ్రోగిస్తావు  
అందుకే ఓ భోలే నాధ్ నీ ముందు బోల్తా పడ్డాను

శివోహం

శంభో ! సర్వ జ్ఞానివి... 
సమస్త లోకాలను ఏలే వాడవు... 
సకల శుభాలను ఇచ్చేవాడవు... 
సకలమూ ఎరిగిన వాడవు... 
సమస్తమూ వ్యాపించిన... 
ఆనంద తాండవ నటరాజా... 
మాత బాలాత్రిపురసుందరిదేవితో 
కూడి నాకు జ్ఞానఐశ్వైర్యాన్ని ప్రసాదించుము... 
నన్ను అనుగ్రహించుము తండ్రీ... 

మహాదేవా శంభో శరణు...

శివోహం

అయ్యప్ప నామస్మరణం సకల పాపహరణం...
అయ్యప్ప దర్శనం జన్మజన్మల పుణ్యఫలం...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

మానవుడు చేసిన బొమ్మలు కావవి
మరువకుండా నిన్ను చూసుకునే స్వరూపాలు
మూసగా రూపాలన్నీ ఒకే స్వరూపం కలిగినా
మరి నీవు చేసిన మానవ రూపాలలో
బేధమెలా సాధ్యమయ్యేను మల్లికార్జునా
ఇంత ఆలోచనగా మమ్మల్ని సృష్టించిన
మిమ్మల్ని ఎందుకు మరచిపోతున్నాము.
నీమాయను తెలుసుకునేదెలా...
మహాదేవా శంభో సరనుం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...