చిత్తం చపలం దాని ధోరణి చిత్రానుచిత్రం...
ఒకోసారి నిరాశధోరణి...
మరోసారి ఆశావహ దృక్పధం...
ఎప్పుడు దేనిని పట్టుకుంటుందో, దేనిని విడిచిపెడుతుందో కానీ, అందలం ఎక్కిస్తుంది,
దాని నియంత్రణలో ఉన్నంతకాలం అదఃపాతాళంలోనికి పడేస్తుంది...
స్వర్గ నరకాలను చూపిస్తుంది
విస్మయమేమిటంటే, తప్పొప్పులను సమీక్షించుకోకుండా మనస్సుకు తోచిందే సరైనదని సమర్ధించుకుంటూ, అనాలోచిత అభిప్రాయాలను స్థిరపరుచుకుంటూ, సమస్యలను బూతద్దంలో చూసి దుఃఖపడడం!
సమర్ధించుకోవడం కంటే సరిదిద్దుకుంటే చాలావరకు దుఃఖం మటుమాయం.