Wednesday, August 16, 2023

శివోహం

కొన్ని మార్లు క్షణాలలో గడచిపోతుంది జీవితం

    మరికొన్ని సందర్భాలలో, కొన్ని క్షణాలు గడువడానికి యుగాలు పడుతుంది...

శివోహం

శివా!నాగులు నీకు భూషణమయ్యాక
వాటి తలలోని విషమంత తరిగిపోయె
నిర్వీర్యమవనీ నాలోన విషమున్నా
మహేశా . . . . . శరణు .

శివోహం

శివుడు పరమ కృపాకరుడు...
కరుణాసింధువు ...
మనసు పెట్టి చేసే ఏ ప్రార్థన అయినా భోళాశంకరుడు వింటాడు...
అనుగ్రహిస్తాడు కూడా...
విశ్వశ్వరుణ్ణి నిర్మల హృదయంతో ధ్యానిస్తూ ఆర్తితో ఆక్రోశించాలి...
అందుకు కావాల్సిన శక్తినీ, బుద్దీని స్పూర్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మనం అనుభవిస్తున్న కర్మఫలం తో బాటు, ఈశ్వరుని కృపను, వివేకాన్ని, కరుణించమని కోరుకుందాం.
దైవంపై భారాన్ని వేసే చిత్తశుద్ధిని అలవర్చుకుందాం.
ఓం శివోహం... సర్వం శివమయం.

Tuesday, August 15, 2023

శివోహం

శివా ! నా కర్మల జన్మలు కాలిపోతూ ఉంటే 
నావైపు చూసి ఏడ్చేస్తావు 
ఏడ్చేసి నీవైపు నేను వచ్చేస్తుంటే 
నను చూసి నవ్వేస్తావు 
శివా ! నీ దయ

శివోహం

శంభో...
అనుభవం నేర్పిన విజ్ఞానం తో భావములోనా, బాహ్యమునందున నిన్నే దర్శించుకుంటున్నా...
నీవే తప్ప నాకు వేరే దారి లేదు తండ్రీ...
నా చిత్తశుద్ధిని ,నిశ్చలతత్వం ను అనుగ్రహించూ పరమేశ్వర...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!నిష్టూరాలు నీలి మబ్బులు
కష్టాలు కడలి కెరటాలు
కూలి కరగిపోవు నీ కంటి చూపుతో
మహేశా . . . . . శరణు .

శివోహం

మానవ పుర్రె ఓక కోరికల గంప దీని నింప గలవారు ఈ భూమి మీద లెడు...
ఈ కోరిక తీరింది అనుకోవడమే కొత్త కోరిక కు పునాది....
కోరికలకు అది లేదు అంతం అంత కన్నా లేదు...
కాబట్టి కోరిక దుఃఖం కు మూలం...
ఎన్ని కొరికలో అంతే దుఃఖం...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...