Friday, August 25, 2023

శివోహం

ఉన్నది నువ్వు...
ఉన్నదని తెలుసుకోకడం కోసమే నా ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం.

శివ నీ దయ.

శివోహం

జీవిత చక్రం తిరుగుతున్నాళ్లు...
ఈ బ్రతకు పోరాటం తప్పదు...

శివ నీ దయ.

శివోహం

శివా!నీ గురించి అంతటా చెప్పితి
నా గురించి నంది చెవిలో చెప్పితి
నేనూ బంటనై వున్నాను నీ బంటును కూడి
మహేశా . . . . . శరణు .

శివోహం

భగవంతుడు సర్వవ్యాపి...
కొందరు ఏమనుకుంటారు దేవలయంలోనే దేవుడు ఉన్నాడని భ్రమ పడుతుంటారు...
గుడికి వెళ్ళాలి ఎందుకు చిత్త శుద్ధి కోసం, చిత్తం శుద్ధి అయిన తర్వాత అంతటా భగవంతుణ్ణి చూడాలి... ఎదగాలి ఒక స్థాయి నుండి ఉత్తమ స్థాయికి లేకపోతె ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది...
బయట వెతకడం కాదు అంతర్ముఖత చెంది పరమాత్మని లోపల వెతకాలి...
అప్పుడే నీలో అసలైన భక్తి మొదలవుతుంది.

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, August 24, 2023

శివోహం

శివా!రేయి పగలై వెలుగు నీ రెండు కళ్ళు
ముక్తి పదమును చూపు నీ మూడవ కన్ను
నా మనసు మన్నైపోనీ నేను నీవైపోనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

నరుని నాలుక పలుచన
అన్ని అసత్యలే పలుకుచుండె..

శివ నీ దయ నీవే తప్ప ఇతః పరంబెరుగ  నీవే శరణు.

అమ్మ దయ

బిడ్డ ఏదైతే చెప్పలేదో మనసులో ఉన్న మాటను ఒక్కరు మాత్రమే అర్థం చేసుకోగలరు తానే అమ్మ.
అందుకే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే                                    ఓం శ్రీమాత్రే నమః

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...