Friday, September 1, 2023

శివోహం

శివా ! జడల విప్పిన నా అహంకారం 
నీవే అంతా అని తెలిసినా తెల్సుకోని నా అజ్ఞానం 
నీవే అంతా అని ఏదో నాటికి తెలుసుకోవాలని 
నీ ప్రేమ పూర్వక ఆలింగన మివ్వాలని 
నా కోసం నీవు ఆరాట పడుతూ ఉంటావు. 
నేను ఆశ పడుతూ ఉంటాను. శివా ! నీ దయ

శివోహం

శివ ఈ జగత్తులో  నిను మించిన నా హితాభిలాషి  నా మంచిని కోరుకునే వారు వేరే ఎవరు లేరు...
పరమాత్మా నీవే ఉన్నావు
అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ.
శివ నీ దయ.

శివోహం

పరిగేడుతున్న నా మనసును పట్టు పట్టి  నీ యెదుట కూచోబెట్టు...

శివ నీ దయ
ఓం శ్రీ పరమాత్మనే నమః.

శివోహం

శివా!జాగృతమై వున్నాను జగతిలొ నేను
అది కలలో కలయని వింటున్నాను
సుషుప్తిని చూడనీ తురీయానికి చేరనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

మంచి చెడ్డల సంద్రంలో...
దారి మరిచిన నావని నేను...
నేను నమ్మిన నావికుడవు నువ్వు...
నీ వైపుకు నా ప్రయానాణ్ణి మరలించు....
నిన్ను చేరే గమ్యానికి దారి చూపించు...

మహాదేవా శంభో శరణు...

Thursday, August 31, 2023

శివోహం

అద్దె ఇల్లు...
అక్కరకు రాని బంధాలాతో నాకే ఇరుకుగా ఉంది ఆహ్వానించలేను కానీ నీ కైలాసం కన్నా పెద్దది నా హృదయం...

శివ నీ దయ.

శివోహం

శివా!నీకు నాకు కూసింత దూరమైనా
కాలి నడకను నిను చేర, తీరకుంది
వేరు నడకను నీ చెంతకు రప్పించుకో.
మహేశా . . . . . శరణు

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...