Thursday, November 2, 2023

శివోహం

శివా!నందిని కూడి నడచి వచ్చుట
ఈ వూపున నా మోపున చేర ముచ్చటా
ఆ ముచ్చట తీరనీ ఆ ఫలము నాకందనీ .
మహేశా  .  .  .  .  .  శరణు. .

శివోహం

శివ ధర్మశాసనం లేనిచో...
గ్రహాలకు చలనం లేదు...
వెలుగు ప్రసరించదు...
నీరు ప్రవహించదు...
గాలి వీయదు...
భూమి మొలకెత్తదు...
అంతా శూన్యం...
ఆయనే ధర్మం... 
ఆయనే శాసనం...
ఆయనే చైతన్యం...
ఓం శివోహం... సర్వం శివమయం.

Wednesday, November 1, 2023

శివోహం

ఏంటో లేవగానే కొంచెం మనశ్శాంతి ఇవ్వు అమ్మ అని రోజూ కోరుకోవాల్సి వస్తుంది...
ఈ గజిబిజి ,ఆరాట,ఆలోచనల బ్రతుకు పోరాటాల్లో మనశ్శాంతి కరువయ్యిందే తల్లి...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...
ఓం శ్రీ మాత్రే నమః.

శివోహం

శివ జపిస్తున్న నీ నామాన్ని అక్షర లక్షలుగా...
గుండెల్లో ద్యానిస్తూ...

శివ నీ దయ.

శివోహం

శివా!విభూతిలో మెరిసె నీ విభూతి
నా భస్మమే కావాలి నీకు విభూతి
అందనీ అనుభూతి కందని ఆ విభూతి.
మహేశా . . . . . శరణు .

శివోహం

కళ్ళకు నచ్చిందిమనసు ఇష్టపడుతుందా...
మనసుకునచ్చింది కళ్ళు ఇష్టపడుతున్నాయా..
మనసును కళ్ళు మాయచేస్తున్నాయా...
కళ్ళు మనసును మార్చేస్తున్నాయా...
ఇష్టం మనసులో పుడుతుందా...
కళ్ళు ఇష్టాన్ని పుట్టిస్తున్నాయా...
మనసు మాయలో పడుతుందో...
మనిషి మాయ కోరుకుంటున్నాడో ఎరుక తెలిసిన వాడివి నీవు...
మహాదేవా శంభో శరణు.

శివోహం

సగం జీవితం వ్యర్థం అయ్యాక తెలుస్తుంది..
అమ్మనాన్నల మాటలకి అర్ధాలు...

ఓం నమః శివాయ.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...